UP Girl Changes Gender To Marry Girlfriend, Files Application In Court - Sakshi
Sakshi News home page

UP Viral Marriage: ఇద్దరు యువతులు ప్రేమ పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..

Published Sat, Jul 15 2023 8:26 AM | Last Updated on Sat, Jul 15 2023 11:10 AM

UP Girl Changes Gender To Marry Girlfriend - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన సంఘటన జరిగింది. ఇద్దరు అమ్మాయిలు వివాహం చేసుకోవడానికి కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిలో ఒకరు లింగమార్పిడి చేసుకున్నారు. ఆ సంబంధిత ధ్రువపత్రంతో స్థానిక సబ్‌ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. బరేలీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

రాష్ట్రంలోని బరేలీలో ఇద్దరు అమ్మాయిలు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరి మధ్య స్నేహం.. ప్రేమగా మారింది. వీరిలో ఒకరు బరేలికి చెందినవారు కాగా.. మరొకరు బదాయూ ప్రాంతానికి చెందినవారు. ప్రేమలో ఉన్న వీరు పెళ్లి చేసుకుని కలిసి బతకాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. 

ఆ జంటలోని ఓ అమ్మాయి లింగమార్పిడి చేయించుకుంది. చికిత్స అనంతరం ధ్రువపత్రంతో స్థానిక సబ్ డివిజినల్ కోర్టులో రిజిస్ట్రేషన్‌ వివాహానికి వీరు దరఖాస్తు చేసుకున్నారు. డిజిస్ట‍్రేషన్ ద్వారా వివాహానికి ప్రత్యేక వివాహ చట్టం కింద దరఖాస్తు పెట్టుకున్నారని బరేలీ ఎస్డీఎం ప్రత్యూష పాండే తెలిపారు. ఇలాంటి కేసు చాలా అరుదుగా వస్తుంటాయని చెప్పారు. 

ఇదీ చదవండి: అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్.. అసలే పేషెంట్.. మళ్ళీ పేషెంట్ అయ్యాడు..  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement