
హెడ్డింగ్ చదివి ఈ మాట అన్నది తమన్నా అంటే బాగా ఇష్టపడే అబ్బాయి అనుకునేరు. అయితే ఈ మాట అన్నది కథానాయిక శ్రుతీహాసన్. అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా! ఏం లేదండీ. ఇటీవల ఓ చాట్ షోలో శ్రుతి పాల్గొన్నారు. ఒకవేళ మీరు అబ్బాయి అయితే ఎవర్ని డేట్‌కు తీసుకెళ్లేవారు? అన్న ప్రశ్నను శ్రుతీహాసన్ ముందు ఉంచితే... ‘‘నేను అబ్బాయిని అయితే తమన్నాను డేట్‌కు తీసుకెళ్లేదాన్ని. ఆమెను పెళ్లి చేసుకునేదాన్ని’’ అని చెప్పారు.
ఈ సంగతి ఇలా ఉంచితే... ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్సలేతో శ్రుతీహాసన్ లవ్‌లో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలను కుంటున్నారనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయం గురించి శ్రుతీహాసన్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేదు. ‘మైఖేల్ నా లైఫ్‌లో చాలా స్పెషల్ పర్సన్’ అని మాత్రం చెప్పుకుంటూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment