అతణ్ని పెళ్లాడాలనుంది: అలియా భట్ | I want to marry Ranbir Kapoor: Alia Bhatt | Sakshi
Sakshi News home page

అతణ్ని పెళ్లాడాలనుంది: అలియా భట్

Published Sat, Apr 5 2014 3:17 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అతణ్ని పెళ్లాడాలనుంది: అలియా భట్ - Sakshi

అతణ్ని పెళ్లాడాలనుంది: అలియా భట్

ముంబై: బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ గారాలపట్టి, వర్ధమాన నటి అలియా భట్ యువ హీరో రణబీర్ కపూర్పై మనసు పారేసుకుంది. రణబీర్ ఆరాధ్యనీయ వ్యక్తని, అతణ్ని పెళ్లి చేసుకోవాలనుందని అలియా తన మనుసులో మాటను బయటపెట్టింది. 'కాఫీ విత్ కరణ్' అనే ఓ టాక్ షోలో ఈ ముద్దుగుమ్మ పాల్గింది. కరణ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది. రణబీర్పై ప్రశంసల వర్షం కురిపించింది.

రణబీర్ కపూర్ సెక్సీబాంబ్ కత్రినా కైఫ్తో ప్రేమాయణం నడుపుతున్నాడు. వీరిద్దరూ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నప్పటి ఫొటోలు ఆ మధ్య నెట్లో హల్చల్ చేశాయి. తాజాగా అలియా భట్ తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసింది. రణబీర్ తల్లి నీతూ కపూర్, అన్నింటికి మించి కత్రినా స్పందించాల్సివుందని చెప్పింది. అలియాకు ఇంతకుముందు సహనటులు వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రాతో ఎఫైర్ ఉందంటూ పుకార్లు షికార్లు చేశాయి. అంతేగాక యువ హీరో అర్జున్ కపూర్తో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ అబద్ధమని అలియా కొట్టిపారేసింది. ఈ కార్యక్రమం ఆదివారం స్టార్ వరల్డ్ చానెల్లో ప్రసారం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement