నిజమా! | Actress Tabu to marry a businessman? | Sakshi
Sakshi News home page

నిజమా!

Published Mon, Aug 3 2015 12:17 AM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

నిజమా! - Sakshi

నిజమా!

సినిమా తారల గురించి ఏదో ఒక వార్త ప్రచారం చేయనిదే గాసిప్పురాయుళ్లకు ఆ పూట నిద్రపట్టదు. ఒక్కోసారి ఆ వార్తలు నిజమవుతుంటాయ్ కూడా. ప్రస్తుతం హిందీ రంగంలో ప్రచారమవుతున్న వార్తల్లో టబూకి సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి ఉంది. ఫార్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న టబు పెళ్లి చేసుకోనున్నారన్నదే ఆ న్యూస్. ముంబయ్‌కి చెందిన ఒక వ్యాపారవేత్తను ఆమెను పెళ్లాడనున్నారని భోగట్టా. ఈ వార్తకు ఇటీవల టబు మాట్లాడిన మాటలు ఊతం ఇచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఆమెను ఎవరైనా ‘పెళ్లెప్పుడు?’ అనడగితే.. టైమ్ వచ్చినప్పుడనో.. దాని గురించి ఆలోచించడంలేదనో చెప్పేవారు. కానీ, ఇటీవల ఓ విలేకరుల సమాశంలో ‘పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని పేర్కొన్నారు. సో.. టబు పెళ్లి ఫిక్సయ్యిందా? వెయిట్ అండ్ సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement