లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన బుల్లితెర నటి..! | Tv Actress Arti Singh To Marry Businessman Dipak Chauhan On April 25 | Sakshi
Sakshi News home page

Arti Singh: వ్యాపారవేత్తను పెళ్లాడనున్న బిగ్‌ బాస్ బ్యూటీ!

Published Fri, Apr 5 2024 4:26 PM | Last Updated on Fri, Apr 5 2024 5:45 PM

Tv Actress Arti Singh To Marry Businessman Dipak Chauhan On April 25 - Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. సినీ తారలు సైతం ఈ ఏడాదిలో ఎక్కువగా వివాహాబంధంలోకి అడుగు పెడుతున్నారు. రకుల్ ప్రీత్‌ సింగ్, తాప్సీ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర నటి, బిగ్‌బాస్ బ్యూటీ ఆర్తీ సింగ్ పెళ్లికి రెడీ అయిపోయింది. దాదాపు 39 ఏళ్ల భామ ఈనెల 25న ప్రముఖ వ్యాపారవేత్త దీపక్ చౌహాన్‌ను పెళ్లాడనుంది. ఈ విషయాన్ని నటి వెల్లడించారు. 

ఈ రోజు తన పుట్టిన రోజు కావడంతో ఆర్తి సింగ్ అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఏప్రిల్ 25న ముంబైలోని తమ సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోనున్నట్టు ఆర్తి తెలిపారు. హల్దీ, మెహందీతో పాటు ఫెరాస్ వంటి వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే మాది అరెంజ్‌డ్‌ మ్యారేజ్ అని వెల్లడించారు. ఢిల్లీలోని గురూజీ ఆలయంలో దీపక్ నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. ఈ వివాహానికి నటులు గోవిందా, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ లాంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరు కానున్నారు. 

కాగా.. ఆర్తి ప్రధానంగా మాయకా, గృహస్తి, ఉత్తరన్, ఉడాన్, పరిచయ్, ససురల్ సిమర్ కా, దేవాన్ కే దేవ్...మహదేవ్, వారిస్ లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. 2019లో బిగ్ బాస్ -13 సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని నాలుగో రన్నరప్‌గా నిలిచింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ఈ రియాలిటీ షోలో రెండేళ్లుగా పని లేకపోవడం వల్ల డిప్రెషన్‌కు గురయ్యానని వెల్లడించింది. ఆర్తి ప్రస్తుతం ఉమ్మీద్ కి రోష్ని శ్రావణి అనే సీరియల్‌లో నటిస్తోంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement