
బాలీవుడ్ బుల్లితెర నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శ్రీజితా వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. తన ప్రియుడు మైఖేల్ బ్లోమ్-పేప్‌ను పెళ్లి చేసుకుంది. జర్మనీలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను శ్రీజిత దే తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
(ఇది చదవండి: రిలేషన్‌షిప్‌పై సీతారామం బ్యూటీ ఆసక్తికర కామెంట్స్..! )
శ్రీజిత ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ రోజు మన జీవితంలో ఎప్పుడు లేని ఒక గొప్ప ప్రారంభం. ఒకరి చేతిలో ఒకరి చేయి వేసిన మధుర క్షణం' అంటూ రాసుకొచ్చింది. ఇది చూసిన పలువురు సినీ ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే తాను ప్రియుడిని పెళ్లాడనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరోసారి ఇండియాకు వచ్చాక భారతీయ సంప్రదాయంలోనూ పెళ్లి చేసుకుంటానని తెలిపింది. కాగా.. శ్రీజిత దే బిగ్ బాస్ -16వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఉత్తరన్ సీరియల్‌తో బాలీవుడ్‌లో ఫేమ్ తెచ్చుకుంది.
(ఇది చదవండి: చివరి చిత్రం సక్సెస్.. దర్శకుడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన హీరో!)
Comments
Please login to add a commentAdd a comment