Sreejita De To Marry Boyfriend Michael Blohm Pape In Germany - Sakshi
Sakshi News home page

Sreejita De: ప్రియుడితో పెళ్లాడనున్న బిగ్ బాస్ బ‍్యూటీ!

Published Tue, Jun 27 2023 3:56 PM | Last Updated on Tue, Jun 27 2023 4:57 PM

Sreejita De To Marry Boyfriend Michael Blohm Pape In Germany - Sakshi

బాలీవుడ్ బుల్లితెర నటి శ్రీజిత దే త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఉత్తరన్ సీరియల్‌లో ముక్తా రాథోడ్ పాత్రతో ఫేమ్ తెచ్చుకున్న భామ తన ప్రియుడు  మైఖేల్ బ్లోమ్‌ను పెళ్లాడనుంది. బిగ్ బాస్-16వ సీజన్‌లో మెరిసిన ముద్దుగుమ్మ పలు టీవీ షోలలో కనిపించింది.  ఆమె బాలీవుడ్ చిత్రం తాషన్‌లో కూడా నటించింది.

(ఇది చదవండి: అర్జున్‌ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే)

జూలై 1 జర్మనీలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్‌స్టాలో స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. మా పెళ్లికి మీ అందరికీ ఆహ్వానం అంటూ వెడ్డింగ్ కార్డ్‌ను పంచుకుంది. అయితే తన స్నేహితులు చాలా మంది వివాహానికి హాజరు కాకపోవడంతో తాను నిరాశకు గురవుతున్నట్లు శ్రీజిత తెలిపింది.

ఇన్‌స్టాలో రాస్తూ..'నేను నా పెళ్లి గురించి చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ అదే సమయంలో ఒక విషయం నన్ను బాధపెడుతోంది, నా సన్నిహితలు, మిత్రులు నా వివాహానికి హాజరు కావడం లేదు. ఇది నాకు కొంచెం బాధ కలిగించింది. ఈ ప్రత్యేక ఈవెంట్‌లో లేనందుకు ప్రత్యేకమైన ప్లాన్ చేస్తున్నా. ఇండియాలో మరోసారి జరిగే వివాహంలో తప్పకుండా కలుసుకుంటాం. అప్పుడు అందరితో కలిసి ఎంజాయ్ చేస్తా.' అంటూ పోస్ట్ చేసింది.  జూలై 1న జర్మనీలో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజిత.. ప్రియుడు మైఖేల్ బ్లోమ్‌తో 21 డిసెంబర్ 2021న నిశ్చితార్థం చేసుకుంది.

(ఇది చదవండి: అనుమానాస్పదస్థితిలో డైరెక్టర్ మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement