Recurve team
-
పార్థ్ సాలుంకే ‘స్వర్ణ’ చరిత్ర
లిమెరిక్ (ఐర్లాండ్): భారత ఆర్చరీ ప్లేయర్ పార్థ్ సాలుంకే ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో పసిడి చరిత్ర లిఖించాడు. ఈ టోర్నమెంట్లో అతను పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజేతగా నిలిచాడు. మొత్తంమీద ఈ పోటీల్లో భారత బృందం మునుపెన్నడు లేని విధంగా ఈ టోర్నీలోనే అత్యధికంగా 11 పతకాలు సాధించిన జట్టుగా నిలిచింది. అండర్ –21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో మహారాష్ట్రకు చెందిన 19 ఏళ్ల సాలుంకే... ఆర్చరీలో ఘనాపాటిలైన కొరియన్‌ను కంగుతినిపించాడు. ఫైనల్లో పార్థ్ 7–3తో ఏడో సీడ్ సంగ్ ఇంజున్ను ఓడించాడు. ప్రత్యేకించి పురుషుల రికర్వ్‌లో బంగారు పతకం సాధించిన తొలి ఆర్చర్‌గా పార్థ్ సాలుంకే ఘనత వహించాడు. మహిళల రికర్వ్‌లో ఇదివరకే దీపిక కుమారి (2009, 2011), కొమలిక బారి (2019, 2021) బంగారు పతకాలు సాధించారు. మహిళల అండర్–21 వ్యక్తిగత రికర్వ్ కేటగిరీలో భారత్ ఖాతాలో కాంస్యం చేరింది. భజన్ కౌర్ 7–1తో చైనీస్ తైపీకి చెందిన సు సిన్ యూపై నెగ్గింది. Parth Salunkhe's PURE DETERMINATION. 👏 India has the new 2023 World Archery Youth Champion. 🇮🇳🇮🇳🇮🇳#WorldArchery pic.twitter.com/rTDPYDCDBA — World Archery (@worldarchery) July 9, 2023 చదవండి: #NovakDjokovic: కసితో ఆడుతున్నాడు.. నెట్‌ను కూడా వదలడం లేదు! -
భారత మహిళలకు కాంస్యం
గ్వాంగ్జూ: ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహిళల రికర్వ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అయితే పురుషుల రికర్వ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. తరుణ్‌దీప్ రాయ్, జయంత్ తాలుక్దార్, నీరజ్ చౌహాన్ సభ్యులుగా ఉన్న టీమ్ తమకంటే ర్యాంకుల్లో బాగా వెనుకబడి ఉన్న ఫ్రాన్స్ చేతిలో 2–6 (54–57, 55–52, 53–55, 47–53) తేడాతో ఓటమిపాలైంది. -
ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం
పారిస్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత మహిళల ఆర్చరీ బృందం ఆదివారం సత్తా చాటింది. ఆర్చరీ ప్రపంచకప్‌లో రికర్వ్ టీమ్ భారత్‌కు రెండో స్వర్ణం అందించింది. రికర్వ్ టీమ్‌లో దీపికా కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌లతో కూడిన భారత ఆర్చరీ బృందం మెక్సికోపై 5-1 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం గెలిచింది. కాగా ఆరేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ వ్యక్తిగత విభాగంలో శనివారం పసిడి పతకం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వరల్డ్‌కప్ స్టేజ్–3 టోర్నీలో 32 ఏళ్ల అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. క్రిస్ షాఫ్ (అమెరికా)తో శనివారం జరిగిన ఫైనల్లో అభిషేక్ వర్మ ‘షూట్ ఆఫ్’లో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. చదవండి: చరిత్ర సృష్టించిన భారత్ బాక్సర్.. ప్రపంచ నంబర్ వన్ స్థానం కైవసం -
మళ్లీ రజతమే
డెన్ బాస్చ్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘బంగారు’ స్వప్నం సాకారమవలేదు. 14 ఏళ్ల తర్వాత ఈ మెగా ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన భారత పురుషుల రికర్వ్ జట్టు మళ్లీ రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆదివారం జరిగిన ఫైనల్లో తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన భారత్ 2–6 పాయింట్ల తేడాతో చైనా చేతిలో ఓడింది. ఈ టోర్నీలో భారత్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. -
పసిడిపై గురి
ఎస్–హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పురుషుల ఆర్చరీ జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో అద్వితీయ ప్రదర్శనతో అదరగొట్టింది. బుధవారం క్వార్టర్ ఫైనల్‌కు చేరి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత బృందం... గురువారం మరో రెండు విజయాలు సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం క్వార్టర్ ఫైనల్లో 6–0తో చి చుంగ్ టాన్, యు చెంగ్ డెంగ్, చున్ హెంగ్ చెలతో కూడిన చైనీస్ తైపీ జట్టును ఓడించింది. భారత్ తొలి సెట్‌ను 55–52తో, రెండో సెట్‌ను 55–48తో, మూడో సెట్‌ను 55–54తో గెల్చుకుంది. ఒక్కో సెట్‌కు రెండు పాయింట్ల చొప్పున ఇస్తారు. సెమీఫైనల్లో భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో వాన్ డెన్ బెర్గ్, వాన్ డెర్ వెన్, స్టీవ్ విజ్లెర్‌లతో కూడిన నెదర్లాండ్స్ జట్టుపై గెలిచింది. తొలి సెట్‌ను నెదర్లాండ్స్ 56–54తో, రెండో సెట్‌ను భారత్ 52–49తో, మూడో సెట్‌ను నెదర్లాండ్స్ 57–56తో, నాలుగో సెట్‌ను భారత్ 57–55తో గెల్చుకున్నాయి. దాంతో స్కోరు 4–4తో సమమైంది. విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ను నిర్వహించగా... భారత్ 29–28తో నెదర్లాండ్స్‌ను ఓడించి ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. 14 ఏళ్ల తర్వాత ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. చివరిసారి 2005లో భారత్ ఫైనల్ చేరి తుది పోరులో 232–244తో కొరియా చేతిలో ఓడి రజతం దక్కించుకుంది. చివరిసారి ఫైనల్ చేరిన నాటి భారత జట్టులోనూ తరుణ్‌దీప్ రాయ్ సభ్యుడిగా ఉండటం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో చైనాతో భారత్ పోటీపడుతుంది. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్
ఎస్–హెర్టోగెన్బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. తరుణ్‌దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్‌లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్
కొరియాతో స్వర్ణపతక పోరుకు సిద్ధం కోల్‌కతా: కొలంబియాలోని మెడెలిన్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో రెండో సీడ్‌గా ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత సాధించిన భారత్.. సెమీఫైనల్లో 5-3 తేడాతో చైనాపై విజయం సాధించింది. అంతకుముందు 6-0 తేడాతో స్పెయిన్‌పై, 6-2 తేడాతో చిలీపై గెలుపొంది సెమీస్‌కు చేరింది. సంజయ్ బోరో, అటానుదాస్, తుపువోయి స్వురోలతో కూడిన భారత బృందం ఇక స్వర్ణం కోసం ప్రపంచ చాంపియన్ కొరియాతో తలపడనుంది. మరోవైపు భారత మహిళల రికర్వ్ బృందం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. దీపికా కుమారి గైర్హాజరీలో మహిళల జట్టు 3-5 తేడాతో ఇటలీ చేతిలో ఓటమిపాలైంది. అయితే మిక్స్డ్ రికర్వ్‌లో భారత్ కాంస్యం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాస్-బొంబేలా దేవి జంట మిక్స్‌డ్‌లో మెక్సికోతో తలపడనుంది.