
గ్వాంగ్జూ: ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహిళల రికర్వ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అయితే పురుషుల రికర్వ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. తరుణ్‌దీప్ రాయ్, జయంత్ తాలుక్దార్, నీరజ్ చౌహాన్ సభ్యులుగా ఉన్న టీమ్ తమకంటే ర్యాంకుల్లో బాగా వెనుకబడి ఉన్న ఫ్రాన్స్ చేతిలో 2–6 (54–57, 55–52, 53–55, 47–53) తేడాతో ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment