Archery world cup stage -2
-
భారత మహిళలకు కాంస్యం
గ్వాంగ్జూ: ప్రపంచ ఆర్చరీ స్టేజ్ 2లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహిళల రికర్వ్ విభాగంలో భారత్ కాంస్యం సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 6–2 (56–52, 54–51, 54–55, 55–54) తేడాతో చైనీస్ తైపీపై విజయం సాధించింది. కోమలిక బారి, అంకిత భకత్, రిధి ఫోర్ భారత జట్టులో సభ్యులుగా ఉన్నారు. అయితే పురుషుల రికర్వ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత జట్టు క్వార్టర్ ఫైనల్లోనే వెనుదిరిగింది. తరుణ్‌దీప్ రాయ్, జయంత్ తాలుక్దార్, నీరజ్ చౌహాన్ సభ్యులుగా ఉన్న టీమ్ తమకంటే ర్యాంకుల్లో బాగా వెనుకబడి ఉన్న ఫ్రాన్స్ చేతిలో 2–6 (54–57, 55–52, 53–55, 47–53) తేడాతో ఓటమిపాలైంది. -
ఫైనల్లో టీమిండియా
గ్వాంగ్జు (కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలత కూడిన భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో 29–26తో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. నిర్ణీత 24 షాట్ల తర్వాత రెండు జట్లు 233–233తో సమంగా ఉండటంతో ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. అవనీత్, ముస్కాన్, ప్రియాలతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్య పతకాన్ని గెలిచింది. -
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్లో భారత్
కొరియాతో స్వర్ణపతక పోరుకు సిద్ధం కోల్‌కతా: కొలంబియాలోని మెడెలిన్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-2 పోటీల్లో భారత పురుషుల రికర్వ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో రెండో సీడ్‌గా ఎలిమినేషన్ రౌండ్‌కు అర్హత సాధించిన భారత్.. సెమీఫైనల్లో 5-3 తేడాతో చైనాపై విజయం సాధించింది. అంతకుముందు 6-0 తేడాతో స్పెయిన్‌పై, 6-2 తేడాతో చిలీపై గెలుపొంది సెమీస్‌కు చేరింది. సంజయ్ బోరో, అటానుదాస్, తుపువోయి స్వురోలతో కూడిన భారత బృందం ఇక స్వర్ణం కోసం ప్రపంచ చాంపియన్ కొరియాతో తలపడనుంది. మరోవైపు భారత మహిళల రికర్వ్ బృందం తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. దీపికా కుమారి గైర్హాజరీలో మహిళల జట్టు 3-5 తేడాతో ఇటలీ చేతిలో ఓటమిపాలైంది. అయితే మిక్స్డ్ రికర్వ్‌లో భారత్ కాంస్యం దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాస్-బొంబేలా దేవి జంట మిక్స్‌డ్‌లో మెక్సికోతో తలపడనుంది.