
గ్వాంగ్‌జు (కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నీలో భారత పురుషుల కాంపౌండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో అభిషేక్ వర్మ, రజత్ చౌహాన్, అమన్ సైనీలత కూడిన భారత జట్టు ‘షూట్ ఆఫ్’లో 29–26తో దక్షిణ కొరియా జట్టును ఓడించింది. నిర్ణీత 24 షాట్‌ల తర్వాత రెండు జట్లు 233–233తో సమంగా ఉండటంతో ‘షూట్ ఆఫ్’ను నిర్వహించారు. అవనీత్, ముస్కాన్, ప్రియాలతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు కాంస్య పతకాన్ని గెలిచింది.