
ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు తొలి విజయం సాధించింది. స్వీడన్‌లో సోమవారం పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–2తో నెగ్గింది. సీనియర్ ప్లేయర్ శరత్ కమల్ తాను ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మరో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ నెగ్గడంతో భారత విజయం ఖాయమైంది. తొలి రోజు ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 2–3తో ఓడిపోయింది.