బుడాపెస్ట్: చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు వరుసగా ఏడో విజయం సాధించి టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాయి. జార్జియా జట్టుతో బుధవారం జరిగిన ఏడో రౌండ్ మ్యాచ్‌లో భారత్ 3–1తో గెలిచింది. వైశాలి 62 ఎత్తుల్లో లెలా జవాఖి‹Ùవిలిపై, వంతిక 46 ఎత్తుల్లో బెలా ఖొటె నాష్‌విలిపై నెగ్గారు.
నానా జాగ్‌నిద్జెతో గేమ్‌ను హారిక 59 ఎత్తుల్లో; నినో బత్సియా‹Ùవిలితో గేమ్ ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నారు. తానియా కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు. భారత పురుషుల జట్టు 2.5–1.5తో చైనాపై గెలిచింది.
గుకేశ్ 80 ఎత్తుల్లో యి వెను ఓడించగా... ఇరిగేశి అర్జున్–బు జియాంగ్జి గేమ్ 26 ఎత్తుల్లో, ప్రజ్ఞానంద–యు యాంగీ గేమ్ 17 ఎత్తుల్లో, హరికృష్ణ–యు వాంగ్ గేమ్ 56 ఎత్తుల్లో ‘డ్రా’ అయ్యాయి. విదిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment