
చెన్నై: ఆసియా నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళల జట్టు 4–0తో; 3.5–0.5తో కిర్గిస్తాన్‌పై... భారత పురుషుల జట్టు 2.5–1.5తో; 2.5–1.5తో మంగోలియాపై గెలిచాయి. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో మంగోలియాతో భారత మహిళల జట్టు; ఇరాన్‌తో భారత పురుషుల జట్టు తలపడతాయి. టీమ్ విభాగంలో ఫలితాలను లెక్కలోనికి తీసుకొని వ్యక్తిగత విభాగంలో పతకాలను అందజేయగా... మహిళల టాప్ బోర్డుపై ఆడిన ఆర్.వైశాలి (6.5 పాయింట్లు), ఐదో బోర్డుపై ఆడిన మేరీఆన్ గోమ్స్ (5 పాయింట్లు) స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. మూడో బోర్డుపై ఆడిన పద్మిని రౌత్ (7.5 పాయింట్లు) ఖాతాలో రజతం చేరింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో రెండో బోర్డుపై ఆడిన శశికిరణ్ (8 పాయింట్లు) రజతం గెల్చుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment