ఆర్చరీ ఒలింపిక్ క్వాలిఫయర్
అంటల్యా (టర్కీ): పారిస్ ఒలింపిక్స్ ఆర్చరీ ఆఖరి క్వాలిఫయర్ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు కూడా మహిళల టీమ్ బాటలోనే పయనించింది. భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. దాంతో పారిస్ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించాలంటే జట్టు ర్యాంకింగ్‌పైనే ఆధారపడి ఉంటుంది.
ఈ టోర్నీలో టాప్–3లో నిలిచే జట్లకు నేరుగా ఒలింపిక్స్ అవకాశం దక్కేది. క్వార్టర్స్‌లో వరల్డ్ నంబర్ 2 భారత పురుషుల జట్టు 4–5 (57–56, 57–53, 55–56, 55–58), (26–26) స్కోరుతో మెక్సికో చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. తొలి రెండు సెట్‌లను గెలిచి ఆధిక్యంలో నిలిచిన భారత్ మూడో సెట్‌లో సమంగా నిలిచినా సెమీస్ చేరేది.
కానీ ఒక పాయింట్ తేడాతో సెట్‌ను కోల్పోయిన జట్టు తర్వాతి సెట్‌ను కూడా మెక్సికోకు అప్పగించింది. అయితే షూటౌట్‌లో భారత్ మ్యాచ్ కోల్పోయింది. మెక్సికో ఆర్చర్లు ల„ ్యానికి అతి సమీపంగా బాణాలను సంధించి పైచేయి సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment