
ప్యారిస్ ఒలింపిక్స్-2024 ఆర్చరీ విభాగంలో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మహిళల వ్యక్తిగత ఈవెంట్ క్వార్టర్‌ఫైనల్స్‌లో భారత ఆర్చర్ దీపికా కుమారి ఓటమి పాలైంది. తొలి రౌండ్‌లో ఒలింపిక్ ఛాంపియన్ మిచ్చెల్లి క్రొప్పన్‌ను ఓడించి తన సత్తాచాటిన దీపికా కుమారి .. క్వార్టర్‌లో మాత్రం తన జోరును కొనసాగించలేకపోయింది.
దక్షిణ కొరియాకు చెందిన నామ్ సుహియోన్ చేతిలో4-6 తేడాతో దీపికా కుమారి పరాజయం పాలైంది. 3వ సెట్ ముగిసే సమయానికి దీపిక 4-2తో ముందంజలో ఉన్నప్పటకి.. తర్వాత సెట్‌లలో పేలవమైన షూటింగ్‌ల కారణంగా ఆమె తమ సెమీ-ఫైనల్ బెర్త్‌ను కోల్పోయింది.

అదేవిధంగా మరో ఆర్చర్ భజన్ కౌర్ రౌండ్-16లోనే ఇంటిముఖం పట్టింది. ఇండోనేషియాకు చెందిన డియానందా చోయిరునిసా చేతిలో భజన్ కౌర్ ఓటమి చవిచూసింది. దీంతో ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ల ప్రయాణం ముగిసింది. మరోసారి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి భారత ఆర్చర్లు ఇంటిముఖం పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment