
బటూమి (జార్జియా): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత పురుషుల జట్టు 3.5–0.5తో ఎల్ సాల్వడార్ జట్టుపై... భారత మహిళల జట్టు 4–0తో న్యూజిలాండ్‌పై విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్, ద్రోణవల్లి హారికలకు విశ్రాంతి ఇచ్చారు. పురుషుల జట్టు తరఫున పెంటేల హరికృష్ణ 33 ఎత్తుల్లో జార్జి ఎర్నెస్టో గిరోన్‌పై, విదిత్ 23 ఎత్తుల్లో రికార్డో చావెజ్‌పై, ఆధిబన్ 30 ఎత్తుల్లో డానియల్ ఎరియాస్‌పై నెగ్గగా... కార్లోస్ బర్గోస్‌తో జరిగిన గేమ్‌ను శశికిరణ్ 52 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
మహిళల జట్టు తరఫున కోనేరు హంపి 36 ఎత్తుల్లో హెలెన్ మిలిగన్‌పై, తానియా సచ్‌దేవ్ 67 ఎత్తుల్లో వ్యాన్లా పున్సాలన్‌పై, ఇషా కరవాడే 37 ఎత్తుల్లో జాస్మిన్ జాంగ్‌పై, పద్మిని రౌత్ 36 ఎత్తుల్లో నికోల్ కిన్‌పై గెలిచారు. ఈ విజయాలతో భారత జట్లకు రెండేసి పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment