
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ప్రస్తుత అధ్యక్షుడు అర్కడి వొర్కోవిచ్ రెండోసారి అధ్యక్షుడయ్యారు. విఖ్యాత చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ ‘ఫిడే’ కార్యవర్గంలోకి రావడం పట్ల వొర్కోవిచ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ఆనంద్‌కు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ వుంది. ఇకపై ‘ఫిడే’ భవిష్యత్తుకు అతని సేవలు కీలకమవుతాయి’ అని అన్నారు.