Viswanathan Anand Commentary Role.. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆనంద్ ఈనెల 24 నుంచి దుబాయ్‌లో జరిగే ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ మ్యాచ్‌కు అధికారిక వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ కార్ల్‌సన్ (నార్వే), నెపోమ్‌నియాచి (రష్యా) ప్రపంచ టైటిల్ కోసం తలపడనున్నారు. గతంలో ఆన్‌లైన్ టోర్నీలకు వ్యాఖ్యాతగా పనిచేసిన ఆనంద్ ఈసారి గెలుపోటముల టెన్షన్ లేకుండా ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్ కోసం వెళ్తుండటం సరదాగా ఉందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment