D Gukesh Become Top-Ranked Indian In Chess Charts, Ends Viswanathan Anand's 36-Year-Long Stay - Sakshi
Sakshi News home page

D Gukesh: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్‌ ఆవిర్భావం

Published Fri, Aug 4 2023 2:52 PM | Last Updated on Fri, Aug 4 2023 3:26 PM

D-Gukesh-Become-Top-Ranked Indian Chess-Ends-Viswanathan Anand-36-Year-Long Stay - Sakshi

భారత చెస్‌లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్‌ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్‌ ఆనంద్‌. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్‌ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్‌ చరిత్రలో 'నయా కింగ్‌'గా అవతరించాడు.

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్‌బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి.

దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది.

"గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది.

ఇక విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచి ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్గా ఉన్నాడు. ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ కొనసాగిస్తే ఆనంద్‌ను మించిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు.

చదవండి: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్‌ ఆవిర్భావం

Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్‌'.. రూల్స్‌ ఒప్పుకోవు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement