FIDE World Rankings
-
విశ్వనాథన్ ఆనంద్‌ను వెనక్కి నెట్టి.. నంబర్ 1గా యువ సంచలనం
D Gukesh Replaces Viswanathan Anand: యువ గ్రాండ్‌మాస్టర్ డి గుకేశ్ సంచలనం సృష్టించాడు. గత మూడు దశాబ్దాలుగా భారత చెస్ ప్రపంచాన్ని ఏలుతున్న దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. 1986 జూలై నుంచి ఇండియా నంబర్ 1గా కొనసాగుతున్న ఆనంద్‌ను గుకేశ్ అధిగమించాడు. ఈ విషయాన్ని ఫిడే శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. తాజా ఫిడే ర్యాంకింగ్స్(సెప్టెంబరు 1 నుంచి)లో 17 ఏళ్ల ఈ చెన్నై గ్రాండ్ మాస్టర్ ఎనిమిదో ర్యాంకు సాధించాడు. తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుని.. ఆనంద్ కంటే ముందు వరుసలో నిలిచాడు. ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. 37 ఏళ్ల రికార్డు బద్దలు ఈ నేపథ్యంలో తన మెంటార్ ఆనంద్ పేరిట ఉన్న 37 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి గుకేశ్ భారత్ తరఫున నెంబర్ 1 ర్యాంకర్‌గా అవతరించాడు. ఆగష్టు 1 నుంచి రేటింగ్ మెరుగుపరచుకుంటూ మూడు స్థానాలు ఎగబాకిన గుకేశ్ ప్రస్తుతం 2758 పాయింట్లు కలిగి ఉండగా.. ఆనంద్ స్కోరు 2754. ఇదిలా ఉంటే.. ఫిడే వరల్డ్‌కప్-2023 రన్నరప్‌గా నిలిచిన ఆర్ ప్రజ్ఞానంద 2727 పాయింట్లతో 19వ ర్యాంకు సాధించి.. భారత్ తరఫున టాప్-3లో నిలిచాడు. ఇక వీరి ముగ్గురితో పాటు విదిత్ సంతోష్ గుజరాతి(27వ ర్యాంకు), అర్జున్ ఇరిగేసి(తెలంగాణ- 29వ ర్యాంకు) టాప్-30లో చోటు దక్కించుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణ 31వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా డి గుకేశ్ ఇటీవల ముగిసిన ఫిడే వరల్డ్‌కప్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్ చేరిన విషయం విదితమే. చదవండి: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే It's official! Gukesh is India's #1 in the #FIDErating list! 🔥 The 17-year-old prodigy makes history by overtaking the five-time World Champion Vishy Anand and terminating his uninterrupted 37-year reign as India's top-rated player! 📷 Stev Bonhage pic.twitter.com/paDli9hslX — International Chess Federation (@FIDE_chess) September 1, 2023 -
36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం
భారత చెస్‌లో కొత్త ఆధిపత్యం మొదలైంది. ఇన్నాళ్లు చెస్ పేరు చెబితే ముక్తకంఠంగా వినిపించే పేరు విశ్వనాథన్ ఆనంద్. దాదాపు 36 ఏళ్ల పాటు ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనందే. కానీ అతని ఆధిపత్యానికి 17 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ డీ గుకేష్ చెక్ పెట్టాడు. తన గురువును మించిపోయిన గుకేష్ ఇండియాలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి భారత చెస్ చరిత్రలో 'నయా కింగ్'గా అవతరించాడు. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) లైవ్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో తొలిసారి ఒక ఇండియన్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌ను మించి రేటింగ్ సాధించాడు.వరల్డ్ కప్ లో భాగంగా తన రెండో రౌండ్ మ్యాచ్ లో అజర్బైజాన్ కు చెందిన మిస్రట్దిన్ ఇస్కాందరోవ్ పై విజయం సాధించాడు. 44 ఎత్తుల్లో గుకేష్ గెలవడంతో అతనికి 2.5 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. దీంతో గుకేష్ లైవ్ రేటింగ్ 2755.9కి చేరింది. మరోవైపు ఆనంద్ 2754.0 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. వరల్డ్ లైవ్ ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం గుకేస్ 9వ స్థానంలో ఉండగా.. ఆనంద్ 10వ స్థానానికి పడిపోయాడు. అధికారిక ఫిడే రేటింగ్ లిస్టు ప్రకటించడానికి ఇంకా సమయం ఉన్నా.. గుకేష్ తన ఆధిపత్యం కొనసాగించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఫిడే ట్వీట్ చేసింది. "గుకేష్ ఇవాళ మళ్లీ గెలిచాడు. దీంతో లైవ్ రేటింగ్ లో విశ్వనాథన్ ఆనంద్ ను మించిపోయాడు. తర్వాతి ఫిడే రేటింగ్ లిస్ట్ అధికారికంగా ప్రకటించడానికి (సెప్టెంబర్ 1న) సుమారు నెల రోజుల సమయం ఉన్నా.. గుకేష్ టాప్ 10లో కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు" అని ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ట్వీట్ చేసింది. Gukesh D won again today and has overcome Viswanathan Anand in live rating! There is still almost a month till next official FIDE rating list on September 1, but it's highly likely that 17-year-old will be making it to top 10 in the world as the highest-rated Indian player!… pic.twitter.com/n3I2JPLOJQ — International Chess Federation (@FIDE_chess) August 3, 2023 ఇక విశ్వనాథన్ ఆనంద్ 1991లో తొలిసారి టాప్ 10లోకి వచ్చినా.. 1987 నుంచి ఇండియాలో అత్యధిక రేటింగ్ ప్లేయర్‌గా ఉన్నాడు. ఆనంద్ కన్నా ముందు 1986 జులైలో ప్రవీణ్ తిప్సే అత్యధిక రేటింగ్ ఉన్న ఇండియన్ ప్లేయర్ గా ఉన్నాడు. ఇప్పుడు గుకేష్ తన లీడ్ ఇలాగే సెప్టెంబర్ 1 వరకూ కొనసాగిస్తే ఆనంద్‌ను మించిన తొలి ప్లేయర్‌గా నిలుస్తాడు. చదవండి: 36 ఏళ్ల ఆధిపత్యానికి తెర.. భారత చెస్‌లో 'నయా' కింగ్ ఆవిర్భావం Yuzvendra Chahal: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు -
ఐదో ర్యాంక్‌కు హారిక
జియాజింగ్ (చైనా): గత రెండు నెలల నుంచి అద్భుతంగా రాణిస్తున్న భారత గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక.. తన ర్యాంకింగ్‌ను కూడా గణనీయంగా మెరుగుపర్చుకుంది. మంగళవారం విడుదల చేసిన ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్‌లో హారిక 10 నుంచి ఐదో స్థానానికి ఎగబాకింది. ఇటీవల చెంగ్డూలో జరిగిన మహిళల గ్రాండ్‌ప్రి టోర్నీ టైటిల్‌ను గెలవడం హారికకు బాగా కలిసొచ్చింది. మరోవైపు చైనాలోనే జరుగుతున్న చైనీస్ చెస్ లీగ్‌లోనూ హారిక జైత్రయాత్ర కొనసాగిస్తోంది. షాన్‌డోంగ్ టీమ్ తరఫున వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. డు యుక్సిన్తో జరిగిన ఈ గేమ్‌లో హైదరాబాదీ పూర్తి ఆధిపత్యాన్ని చూపెట్టింది. టీమ్ షాంఘైకి ప్రాతినిధ్యం వహిస్తున్న మరో గ్రాండ్ మాస్టర్ పెంటేల హరికృష్ణ... గ్జూ మింగ్యు (జియాంగ్ టీమ్)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్నాడు.