తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న చెస్‌ చిచ్చరపిడుగు | 9-Year-Old Charvi Anilkumar, The Highest Rated Female Chess Prodigy In The World | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్న చెస్‌ చిచ్చరపిడుగు

Published Thu, Jan 11 2024 12:28 PM | Last Updated on Thu, Jan 11 2024 2:21 PM

9 Year Old Charvi Anilkumar, The Highest Rated Female Chess Prodigy In The World - Sakshi

బెంగళూరుకు చెందిన చార్వి అనిల్‌ కుమార్‌ తొమ్మిదేళ్ల వయసులోనే చదరంగంలో అద్భుతాలు చేస్తుంది. ఆడుతూపాడుతూ తిరగాల్సిన వయసులో ఈ అమ్మాయి మేధావుల ఆటలో సంచలనాలు సృష్టిస్తుంది. అసాధారణ నైపుణ్యాలు కలిగిన ఈ అమ్మాయి ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ పొందిన మహిళా చెస్ (11 ఏళ్లలోపు) ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 

2022లో అండర్‌-8 ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కిన చార్వి.. ఆ పోటీల్లో అగ్రస్థానంలో నిలువడం ద్వారా 1900 ఎలో రేటింగ్‌ పాయింట్ల మార్కును అధిగమించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లలోనూ చార్వి తన విజయపరంపరను కొనసాగించింది.

ఈ చెస్‌ చిచ్చరపిడుగు ఇండోనేషియాలోని బాలిలో జరిగిన ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో (అండర్ 8)  ఏకంగా ఐదు బంగారు పతకాలు , ఓ రజత పతకం సాధించి, చెస్‌ ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. ఈ అద్భుత ప్రదర్శన కారణంగా చార్వికి ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ (WCM) బిరుదు దక్కింది.

చార్వి.. 2022 అక్టోబర్‌లో తన మూడో మేజర్‌ టైటిల్‌ను సాధించి, చెస్‌ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది.  శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చార్వి ఛాంపియన్‌గా నిలిచి హేమాహేమీల ప్రశంసలను అందుకుంది.

తాజా ర్యాంకింగ్స్‌లో 1915 రేటింగ్‌ పాయింట్లు కలిగి, ఫిడే ర్యాంకింగ్స్‌లో (జూనియర్ బాలికల విభాగం) అగ్రస్థానంలో నిలిచిన చార్వి.. ఈ ఏడాది చివరికల్లా 2200 లేదా 2300 ఎలో రేటింగ్‌ పాయింట్లు సాధించాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు తెలిపింది. చార్వి ప్రస్తుతం బెంగళూరులోని క్యాపిటల్‌ పబ్లిక్‌ స్కూల్‌లో నాలుగో గ్రేడ్‌ చదువుతుంది. చార్వి.. ఆర్‌బి రమేశ్‌ వద్ద చెస్‌ ఓనమాలు నేర్చుకుంది. చార్వి తండ్రి అనిల్‌ కుమార్‌ బెంగళూరులోనే ఓ ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తల్లి అఖిల ఉద్యోగం మానేసి చార్వికి ఫుల్‌టైమ్‌ సపోర్ట్‌గా ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement