
భారతీయ చదరంగం (చెస్) గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూద్దాం. చదరంగం క్రీడ 6వ శతాబ్దంలో గుప్త సామ్రాజ్యంలో భారతదేశంలో ఉద్భవించిందని నమ్ముతారు. చదరంగాన్ని "చతురంగ" అని పిలిచేవారు. చతురంగ అంటే సైనికదళంలో నాలుగు విభాగాలు. పదాతిదళం, అశ్వికదళం, ఏనుగులు మరియు రథం.
విశ్వనాథన్ ఆనంద్: మెరుపు పిల్లాడిగా పిలువబడే విశ్వనాథన్ ఆనంద్ 1988లో భారతదేశపు మొదటి గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అతను ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు.
చెస్ ఒలింపియాడ్ విజయం: ఇటీవలి కాలంలో చెస్ ఒలింపియాడ్స్‌లో విశేషంగా రాణిస్తున్న భారత్.. 2024 FIDE చెస్ ఒలింపియాడ్‌లో డబుల్ స్వర్ణం (ఓపెన్, మహిళలు) సాధించింది.
రైజింగ్ స్టార్స్: రమేష్‌బాబు ప్రజ్ఞానంద, డి గుకేష్ వంటి యువ ప్రతిభావంతులు అంతర్జాతీయంగా అద్భుతాలు చేస్తున్నారు. గుకేష్ ఇటీవల FIDE క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్నాడు.
జాతీయ ఛాంపియన్‌షిప్‌లు: ఇండియన్ నేషనల్ చెస్ ఛాంపియన్‌షిప్ ప్రపంచంలోని పురాతన టోర్నమెంట్‌లలో ఒకటి. మొదటి ఎడిషన్ 1955లో జరిగింది.
విద్యలో చదరంగం: పాఠ్యాంశాల్లో చెస్‌ను చేర్చడంలో విశ్వనాథన్ ఆనంద్ కీలకపాత్ర పోషించాడు. చెస్ విద్యార్థుల్లో వ్యూహాత్మక ఆలోచనా నైపుణ్యాలను మెరుగుపరుస్తుందని ఆనంద్ నమ్మాడు.
చారిత్రక మైలురాళ్ళు: మాన్యువల్ ఆరోన్ 1961లో అంతర్జాతీయ మాస్టర్‌గా మారిన మొదటి భారతీయుడు.
చదరంగం వేరియంట్‌లు: సాంప్రదాయ భారతీయ చెస్ వేరియంట్‌లు "శత్రంజ్" మరియు "చతురంగ" పలు ప్రత్యేక నియమాలను కలిగి ఉంటాయి.
పాప్ సంస్కృతిలో చదరంగం: భారతీయ పాప్ సంస్కృతిలో చదరంగం గణనీయమైన ఉనికిని కలిగి ఉంది. సినిమా మరియు టీవీ కార్యక్రమాలు తరచుగా చెస్‌ను ప్రధాన ఇతివృత్తంగా ప్రదర్శిస్తాయి.
గ్లోబల్ ఇన్‌ఫ్లూయెన్స్: చదరంగంలో భారత దేశం యొక్క సహకారం ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. భారత్ రికార్డు స్థాయిలో గ్రాండ్‌మాస్టర్‌లు, అంతర్జాతీయ మాస్టర్‌లను ఉత్పత్తి చేస్తుంది.
చదవండి: బంగారం... మన చదరంగం
Comments
Please login to add a commentAdd a comment