చెస్ ఒలింపియాడ్ ఓపెన్ విభాగంలో భారత్ తొలిసారి స్వర్ణ పతకం సాధించింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు ఈ ఘనత సాధించింది. ఇవాళ (సెప్టెంబర్ 22) జరిగిన చివరి రౌండ్‌లో భారత్.. స్లొవేనియాపై విజయం సాధించి, బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. 97 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో భారత్ స్వర్ణం కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. 2014, 2022 ఎడిషన్లలో భారత్ కాంస్య పతకాలు సాధించింది.
And Team India checkmates history by bringing home GOLD for the first time in 97 years of the game!
Heartiest congratulations to our unstoppable Grandmasters @DGukesh, @rpraggnachess, @ArjunErigaisi, @viditchess, and @HariChess on winning GOLD🥇at the 45th FIDE Chess Olympiad!… pic.twitter.com/FNOtQ9LCCs— Nitin Narang (@narangnitin) September 22, 2024
స్లొవేనియాతో జరిగిన చివరి రౌండ్ పోటీల్లో అర్జున్ ఎరిగైసి భారత్‌కు తొలి విజయాన్ని అందించాడు. ఆ తర్వాత డి గుకేశ్, ఆర్ ప్రజ్ఞానంద వరుస విజయాలు సాధించి భారత్‌కు స్వర్ణ పతకం ఖరారు చేశారు. ఈ ఎడిషన్‌లో భారత్ ఒక్క రౌండ్‌లోనూ ఓడిపోకుండా అజేయ జట్టుగా నిలిచింది. ఆది నుంచి ఎనిమిది రౌండ్ల పాటు విజయాలు సాధించిన భారత్.. తొమ్మిదో రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఉజ్బెకిస్థాన్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. అనంతరం టాప్ సీడ్ యూఎస్‌ఏ, స్లొవేనియాపై విజయాలు సాధించి తిరిగి గెలుపు బాట పట్టింది.
చదవండి: శెభాష్ టీమిండియా.. చదరంగంలో స్వర్ణ చరిత్రకు చేరువలో
Comments
Please login to add a commentAdd a comment