
న్యూఢిల్లీ: మహిళల టెన్నిస్ టీమ్ ఈవెంట్ బిల్లీ జీన్ కింగ్ కప్‌లో పాల్గొనే భారత జట్టులో తెలుగమ్మాయిలు సహజ యామలపల్లి, భమిడిపాటి శ్రీవల్లి రష్మిక ఎంపికయ్యారు. అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) సెలక్షన్ కమిటీ ఈ టోర్నీ కోసం ఐదుగురు సభ్యుల జట్టును శనివారం ప్రకటించింది. ఇందులో సహజ, శ్రీవల్లిలతో పాటు భారత నంబర్‌వన్ ర్యాంకర్ అంకిత రైనా, వైదేహి చౌదరి, ప్రార్థన తొంబరే ఉన్నారు.
ఇటీవల ముంబైలో జరిగిన డబ్ల్యూటీఏ టోర్నీలో సంచలన ప్రదర్శన కనబరిచిన మాయ రాజేశ్వరన్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపిక చేశారు. ఈ టీమ్‌కు విశాల్ ఉప్పల్ నాన్‌ప్లేయింగ్ కెపె్టన్‌గా వ్యవహరిస్తారు. పురుషుల విభాగంలో జరిగే ప్రతిష్టాత్మక డేవిస్ కప్ టోర్నమెంట్‌లాగే మహిళల ఈవెంట్‌లో జరిగే టోర్నీయే ఈ ‘బిల్లీ జీన్ కింగ్ కప్’. ఈ సారి ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యమివ్వబోతోంది. పుణేలోని దక్కన్ జింఖానా కాంప్లెక్స్‌లో ఏప్రిల్ 8 నుంచి బిల్లీ జీన్ కింగ్ కప్ పోటీలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment