వింబుల్డన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం | Wimbledon 2021: Two Matches Under Investigation Over Suspicious Betting | Sakshi
Sakshi News home page

Wimbledon 2021: వింబుల్డన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కలకలం

Published Wed, Jul 14 2021 11:30 AM | Last Updated on Wed, Jul 14 2021 12:27 PM

Wimbledon 2021: Two Matches Under Investigation Over Suspicious Betting - Sakshi

ఫైల్‌ ఫోటో

లండన్‌: వింబుల్డ‌న్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జ‌రిగింద‌న్న అనుమానాలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్‌, మ‌రో డ‌బుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌ జరిగినట్లు గుర్తించిన ఇంట‌ర్నేష‌నల్‌ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచార‌ణ జ‌రుపుతోంది. విషయంలోకి వస్తే..  మెన్స్ డ‌బుల్స్ ఫ‌స్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్ప‌ద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువ‌గా ఉన్న స‌మ‌యంలో ఈ మ్యాచ్ ఫేవ‌రెట్ జోడీ ఓడిపోయిన‌ట్లు ప‌లు బెట్టింగ్ సంస్థ‌లు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి త‌ర్వాతి రెండు సెట్ల‌ను ఓడిపోయింది.

ఇక మ‌రొక‌టి జ‌ర్మ‌న్ ప్లేయ‌ర్ ఆడిన ఫ‌స్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్‌. అయితే ఆ ప్లేయ‌ర్ ప్ర‌త్య‌ర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ త‌ర్వాత ప‌రిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ న‌డిచిన‌ట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో స‌ర్వీస్ గేమ్స్ సంఖ్య‌పై కూడా ప్ర‌త్యేక బెట్స్ న‌డిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్ మ‌ధ్య మొత్తం 11 మ్యాచ్‌ల‌పై ఫిక్సింగ్ ఫిర్యాదుల‌ను ఐటీఐఏ అందుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement