singles
-
రాష్ట్ర స్క్వాష్ టోర్నీ విజేత తనూజ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గేమ్ పాయింట్’ తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో అండర్–13 బాలుర సింగిల్స్ విభాగంలో పులి తనూజ్ రెడ్డి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో కొండపర్తి ప్రభాస్‌పై తనూజ్ రెడ్డి విజయం సాధించాడు. తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిది విభాగాల్లో కలిపి మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబూరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, గేమ్‌పాయింట్ తెలంగాణ స్క్వాష్ చాంపియన్‌షిప్ చైర్మన్ ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. అండర్–13 బాలుర సింగిల్స్: 1. పులి తనూజ్ రెడ్డి, 2. కొండపర్తి ప్రభాస్. అండర్–15 బాలికల సింగిల్స్: 1. అర్ణా ద్వివేది, 2. గంజి ధృతి. అండర్–17 బాలుర సింగిల్స్: 1. రాజ్వీర్ గ్రోవర్, 2. రోహన్ అరిగల. పురుషుల సింగిల్స్: 1. కరణ్ వశిష్్ట, 2. రణ్వీర్ గ్రోవర్. మహిళల సింగిల్స్: 1. ఆర్యా ద్వివేది, 2. శాన్వీ శ్రీ. పురుషుల సింగిల్స్ (ప్లస్ 35): 1. సర్వేశ్ చౌహాన్, 2. సోలీ కొలా. పురుషుల సింగిల్స్ (ప్లస్ 40): 1. ప్రియతోశ్ దూబే, 2. మయాంక్ మల్హాన్. పురుషుల సింగిల్స్ (ప్లస్ 45): 1. దానం భరత్, 2. బత్తుల రామ్. -
యూఎస్ ఓపెన్‌లో పెను సంచలనం.. 87 ఏళ్ల రికార్డు బద్దలు
చైనాకు చెందిన టెన్నిస్ ఆటగాడు యూ వైబింగ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో చరిత్ర సృష్టించాడు. 63 ఏళ్ల తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్‌లో చైనా నుంచి సింగిల్స్ విభాగంలో తొలి రౌండ్లో విజయం సాధించిన రెండో ఆటగాడిగా యూ వైబింగ్ రికార్డులకెక్కాడు. విషయంలోకి వెళితే.. 174వ ర్యాంకర్ అయిన యూ వైబింగ్.. తొలి రౌండ్లో జార్జేరియాకు చెందిన 31వ సీడ్ నికోలోజ్ బాసిలాష్విలిని 6-3,6-4,6-0తో వరున సెట్లలో కంగుతినిపించాడు. కాగా 22 ఏళ్ల యూ వైబింగ్ మ్యాచ్‌లో తొమ్మిది ఏస్‌లు.. 31 విన్నర్లు సంధించాడు. టెన్నిస్‌లో మేజర్ గ్రాండ్‌స్లామ్‌లు చూసుకుంటే 1959 తర్వాత చైనా నుంచి ఒక ఆటగాడు సింగిల్స్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1959లో వింబుల్డన్‌లో మెఫు-చి మాత్రమే మేజర్ విజయాలు సాధించాడు. ఇక 1935లో చైనాకు చెందిన చెంగ్ గయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో తొలి రౌండ్ మ్యాచ్ గెలిచాడు. అప్పటినుంచి చూసుకుంటే మళ్లీ ఒక్క చైనీస్ ఆటగాడు యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయారు. తాజాగా యూ వైబింగ్ మాత్రమే యూఎస్ ఓపెన్‌లో తొలి రౌండ్‌ను విజయవంతంగా అధిగమించాడు. కాగా 2017లో జూనియర్ చాంపియన్‌గా నిలిచిన యూ వైబింగ్ ఆ తర్వాత ప్రొఫెషనల్ కెరీర్లో రాణించలేకపోయాడు. వరుస గాయాలు అతన్ని ఇబ్బందిపెట్టాయి. మార్చి 2019 నుంచి జనవరి 2022 వరకు యూ వైబింగ్ టెన్నిస్‌కు మొత్తానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత గాయం నుంచి కోలుకొని మార్చిలో బరిలోకి దిగిన యూ వైబింగ్ ర్యాంక్ 1869. అయితే వరుసగా 14 మ్యాచ్‌లు(తాజా దానితో కలిపి) విజయాలు సాధించి ఏకంగా 174వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక యూ వైబింగ్ తన తర్వాతి మ్యాచ్ పోర్చుగీస్‌కు చెందిన నునో బోర్జెస్‌తో ఆడనున్నాడు. Wu Yibing has become the first man from China to win a men's Grand Slam match in 63 years after he beat Nikoloz Basilashvili 6-3 6-4 6-0. Trailblazer 🔥 #USOpen pic.twitter.com/zlZm9Tnd2u — Eurosport (@eurosport) August 29, 2022 చదవండి: US Open 2022: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సెరెనా -
వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
లండన్: వింబుల్డన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న అనుమానాలు కలకలం రేపుతున్నాయి. ఒక సింగిల్స్ మ్యాచ్, మరో డబుల్స్ మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినట్లు గుర్తించిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) విచారణ జరుపుతోంది. విషయంలోకి వస్తే.. మెన్స్ డబుల్స్ ఫస్ట్ రౌండ్ మ్యాచ్ అనుమానాస్పద లిస్ట్‌లో ఉంది. లైవ్ బెట్స్ చాలా ఎక్కువగా ఉన్న సమయంలో ఈ మ్యాచ్ ఫేవరెట్ జోడీ ఓడిపోయినట్లు పలు బెట్టింగ్ సంస్థలు ఫిర్యాదు చేశాయి. ఈ జోడీ తొలి సెట్ గెలిచి తర్వాతి రెండు సెట్లను ఓడిపోయింది. ఇక మరొకటి జర్మన్ ప్లేయర్ ఆడిన ఫస్ట్ రౌండ్ సింగిల్స్ మ్యాచ్. అయితే ఆ ప్లేయర్ ప్రత్యర్థిపై ఈ మ్యాచ్‌లో అనుమానాలు ఉన్నాయి. సెకండ్ సెట్ తర్వాత పరిస్థితిపై ఐదు అంకెలలో బెట్టింగ్ నడిచినట్లు తేలింది. ఈ మ్యాచ్‌లో సర్వీస్ గేమ్స్ సంఖ్యపై కూడా ప్రత్యేక బెట్స్ నడిచాయి. దీంతోపాటు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ మధ్య మొత్తం 11 మ్యాచ్‌లపై ఫిక్సింగ్ ఫిర్యాదులను ఐటీఐఏ అందుకుంది. -
జ్వెరెవ్ చేతిలో రాఫెల్ నాదల్కు షాక్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో టాప్ సీడ్, ఐదుసార్లు మాజీ చాంపియన్ నాదల్‌పై నెగ్గి సెమీఫైనల్ చేరాడు. క్లే కోర్టులపై నాదల్‌పై జ్వెరెకిదే తొలి విజయం కావడం విశేషం. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ సర్వీస్‌ను జ్వెరెవ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు. ఇప్పట్లో బాచ్ ‘టోక్యో’ పర్యటన కష్టమే... టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ నెలలో జపాన్‌కు రావడం కష్టమేనని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం మే 11 వరకు టోక్యోతోపాటు మరో మూడు నగరాల్లో విధించిన అత్యవసర పరిస్థితిని ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. దాంతో థామస్ బాచ్ పర్యటన వాయిదా పడే అవకాశముంది. -
క్రష్‌లు వందల్లో ఉన్నా ఒక్కళ్లూ సెట్టవ్వలే
కుర్రహీరో నితిన్, రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్ పేరుతో విడుదలైన టీజర్ యూత్‌ను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిన విషయమే. తాజాగా ‘భీష్మ’ నుంచి తొలిపాటను చిత్రబృందం విడుదల చేసింది. 'సింగిల్స్ యాంథమ్' పేరుతో రిలీజైన ఈ గీతానికి అభిమానుల నుంచి ముఖ్యంగా సింగిల్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో హీరో సింగిల్ అని చెప్తూనే ‘రెడీ టు మింగిల్’ అని సిగ్నల్స్ ఇస్తున్నాడు. జంటల్ని చూస్తే జెలసీ అని చెప్తూనే తనూ అమ్మాయిల వెనక పడుతున్నాడు. ఇక ఈ సాంగ్ సింగిల్స్‌కు తప్పకుండా నచ్చుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీమణి రచించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించాడు. (భీష్మ: ఫస్ట్ గ్లింప్స్) ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘నితిన్, రష్మిక జంట చూడముచ్చటగా ఉందంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. భీష్మ ప్రచార చిత్రాలకు ప్రేక్షకాభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పటికే విడుదలైన చిత్రంలోని వీడియో దృశ్యాలు విపరీతంగా వైరల్ అయ్యాయి. 'భీష్మ' కథ, కథనాలు, సన్నివేశాలు, సంభాషణలు అన్నీ చాలా కొత్తగా ఉంటాయి. ప్రతీ అబ్బాయి నితిన్ పాత్రకు, ప్రతీ యువతి రష్మిక పాత్రకు కనెక్ట్ అవుతారు. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. వినోద ప్రధానంగా సాగుతుంది’ అని తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరి లో విడుదల కానుంది. చదవండి: ట్రెండింగ్‌లో ‘భీష్మ’ -
సింగిల్.. జోష్ ఫుల్
నేడు సింగిల్స్ అవేర్నెస్ డే మనకు నచ్చిన వారికి మనం నచ్చలేదు. మనల్ని మెచ్చిన వారు మనకి నచ్చలేదు. ఫైనల్‌గా మిగిలింది ఒంటరి ప్రయాణం. సోషల్ యానిమల్గా పుట్టిన మనిషి సింగిల్‌గా సెటిలవ్వాలంటే సింపుల్ థింగ్ కాదు. కానీ, జంటగా ఉన్న వారిని మించిన ఆనందాలను అందుకుంటున్న ‘ఏక్ నిరంజన్’లు సిటీలో ఉన్నారు. అలాంటి వారినుద్దేశించిందే ఈ సింగిల్స్ అవేర్నెస్ డే! ..:: ఎస్.సత్యబాబు కొన్ని సర్వేల ఫలితాల ప్రకారం.. వాలెంటైన్స్ డే రోజున 60 శాతం మంది ఒంటరితనంలో కుంగిపోతున్నారట. ఇందులో 7 శాతం మంది తీవ్రమైన ఫస్ట్రేషన్‌కు గురవుతున్నారట. ఇలాంటి పరిస్థితుల నుంచీ, రొమాంటిక్ రిలేషన్షిప్లో లేని వ్యక్తుల ఆవేదనలో నుంచి పుట్టిందీ ‘డే’. వాలెంటైన్స్‌డే తర్వాతి రోజును పలు దేశాల్లో సింగిల్స్ అవేర్నెస్ డే ఆర్ అప్రిషియేషన్ డే (ఎస్ఏడీ), క్విర్కీ ఎలోన్ డే అనీ వ్యవహరిస్తారు. ఒంటరిగా ఉండడం శాపం కాదని, బంధాల్లేకపోయినా ఆనందంగా ఉండగలమని చెప్పడానికి ఈ రోజును ప్రత్యేకించారు. ఫిబ్రవరి 15న అమెరికా మహిళల్లో 15 శాతం మంది తమకు తామే ఫ్లవర్స్ పంపించుకుంటారట. చైనాలో మాత్రం నవంబరు 11న సింగిల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ రోజున నాలుగు ఒకట్లు వస్తాయి కాబట్టి అది సింగిల్ లైఫ్‌కు మద్దతిచ్చే సంఖ్య అని భావిస్తారు. ఏం చేస్తారు? ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున సింగిల్ ఈవెంట్స్, ట్రావెలింగ్ చేస్తారు. వాలెంటైన్స్ డే కలర్ అయిన రెడ్‌కు పూర్తి వ్యతిరేకంగా భావించే గ్రీన్ కలర్‌ను ధరిస్తారు. అసలు రిలేషన్స్ అంటే ఇష్టమే లేని వాళ్లు బ్లాక్ ధరిస్తారు. అలాగే సింగిల్ అవేర్నెస్ డే శుభాకాంక్షలు తెలిపే కార్డులు, బహుమతులు, దీని కోసం ప్రత్యేకించిన పాటలు సైతం అందుబాటులో ఉన్నాయి. ఒంటరితనం కాదు దయనీయం... ఒంటరిగా ఉండడం కూడా వేడుక చేసుకోదగిన విషయమేనని ఎస్ఏడీ రూపకర్తలు అంటున్నారు. ఇప్పటికే రిలేషన్లో ఉన్న చాలామంది ఒంటరి జీవితమే మేలనుకుంటున్నారనే విషయాన్ని వీరు గుర్తు చేస్తున్నారు. ‘ఎస్ అయామ్ సింగిల్. అండ్ అయామ్ ఓకే’ అని సగర్వంగా చెప్పాలంటున్నారు. కారణాలేమైనా.. నగర జీవనంలో ఒంటరితనాన్ని ఎంచుకునే వారు పెరిగిపోతున్నారు. ‘ఏ వయసులోనైనా మనిషికి తోడు అవసరం. అది పెళ్లి, స్నేహం, లివిన్ రిలేషన్షిప్... ఇలా ఏ రూపంలోనైనా దొరకవచ్చు. అయితే అది దొరకనంత మాత్రాన దురదృష్టవంతులం అనుకోకూడదు. సింగిల్‌గా ఉన్నవారికి ఆ లోన్లీ ఫీలింగ్ తొలగించేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు తోడునీడ ఆర్గనైజేషన్‌కి చెందిన రాజేశ్వరి. ఒక్కరై రావడం... ఒక్కరై పోవడం... పుట్టుకలోనూ, పోవడంలోనూ మనం ఒంటరులమే. లైఫ్‌లో మనల్ని మనం ప్రేమించలేకపోతే ఎవర్నీ ప్రేమించలేం. మనల్ని మనం నెంబర్‌వన్‌గా ట్రీట్ చేసుకోవాలి. అప్పుడే సింగిల్‌గా ఉండడం జాలి పడాల్సిన విషయం కాదని తెలుస్తుంది. సరైన సోల్‌మేట్ దొరికితే సరే... లేకుంటే సింగిల్‌గా ఉండడంలోనూ ఆనందం ఉంది. - సురేష్, సినీనటుడు సంతోషిస్తున్నా... ఒంటరిగా ఉండడం బాధపడాల్సిన విషయమేమీ కాదు. మనకు నచ్చినట్టు, మనం కోరుకున్నట్టు జీవించడానికి అదో మంచి చాన్స్. మీ సమయం, మీ నిర్ణయాలు, మీ ఆర్థికస్వేచ్ఛ.. అన్నీ మీవే. పిటీ అనే మాటే లేదు. ఆల్ హ్యాపీస్. సింగిల్‌గా ఉండడంలోని హాయిని నేను ఎంజాయ్ చేస్తున్నా. - ఆర్.జె.భార్గవి, రేడియో మిర్చి -
సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగుతేజాలు
తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ మరో సింగిల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సైనా, శ్రీకాంత్ ఫైనల్‌కి చేరారు. శనివారం జరిగిన మహిళల సెమీస్ లో భారత స్టార్ షట్లర్ సైనా 21-10, 21-16 తేడాతో థాయ్‌లాండ్‌కి చెందిన నిచోన్ జిండాపాన్పై నెగ్గింది. మరో తెలుగుతేజం పి.వి.సింధు, స్పెయిన్‌కు చెందిన కరోలినా మరిన్కు మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్‌లో గెలిచిన వారితో సైనా ఫైనల్లో తలపడనుంది. పురుషుల సింగిల్స్ సెమీస్ లో భారత క్రీడాకారుడు కె.శ్రీకాంత్ 12-21, 21-12, 21-14 తేడాతో హెచ్.ఎస్.ప్రన్నోయ్పై విజయం సాధించాడు. -
నాదల్ x ముర్రే
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) సెమీఫైనల్లో తలపడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో నాదల్ 4-6, 6-4, 6-0, 6-1తో ఐదోసీడ్ డేవిడ్ ఫై (స్పెయిన్)పై విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో ముర్రే 6-4, 6-1, 4-6, 1-6, 6-0తో 23వ సీడ్ గేల్ మోన్ఫీల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. నాదల్‌తో గంటా 34 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో ఫై గట్టిపోటీయే ఇచ్చాడు. అయితే 14 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో కేవలం మూడింటిని మాత్రమే సద్వినియోగం చేసుకోవడం ఫైను దెబ్బతీసింది. 50 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు నాదల్ 14 బ్రేక్ పాయింట్లకు తొమ్మిదింటిని వినియోగించుకున్నాడు. నేటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్ జొకోవిచ్ (2) x గుల్బిస్ (18) ముఖాముఖి రికార్డు: 4-1 నాదల్ (1) x ముర్రే (7) ముఖాముఖి రికార్డు: 15-4 సాయంత్రం 6.30 నుంచి నియోప్రైమ్లో ప్రత్యక్ష ప్రసారం -
ఒంటరులే.. విజేతలు!!
నేను సింగిల్.. అవుదాం మింగిల్ అనుకుంటూ పాటలు పాడేస్తున్నారా? కాసేపు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఓసారి విశ్లేషించి చూసుకుంటే, ఇప్పుడు కాదు కదా, భవిష్యత్తులో కూడా పెళ్లికెందుకు తొందర అని మీరు అనుకోక తప్పదు. కొత్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం పురుచ్చితలైవి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వీళ్లంతా ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్లే. మరో పోలిక ఏమిటంటే.. వీళ్లంతా ఒంటరులే. కొత్త ప్రధాని నరేంద్రమోడీకి పెళ్లయినా కూడా చాలాకాలంగా ఆయన బ్రహ్మచర్యాన్నే పాటిస్తున్న విషయం ఇప్పుడు బహిరంగ రహస్యం. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసి, రోజుకు ఐదారు బహిరంగం సభల్లో పాల్గొని, ఎన్నికల వ్యూహాలు రూపొందించి.. ఒకరకంగా ఒంటిచేత్తో బీజేపీకి ఎవరితోనూ కూటమి కట్టాల్సిన అవసరం లేకుండానే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజారిటీ అందించారు. ఒడిషాలో బిజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ ఘోటక బ్రహ్మచారి. దేశమంతా నరేంద్రమోడీ గాలి వీస్తున్నా.. దానికి ఎదురొడ్డి నిలిచి గెలిచిన విజేత ఈయన. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరిగిన ఒడిషాలో నవీన్ సారథ్యంలోని బీజేడీ విజయదుందుభి మోగించింది. మొత్తం 147 సీట్లున్న అసెంబ్లీలో ఏకంగా 115 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గాను 20 స్థానాలు గెలుచుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా బ్రహ్మచారిణే. రాష్ట్రంలో తన ప్రాభవాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇక్కడ మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉండగా, ప్రతిపక్ష డీఎంకేకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఏకంగా 37 సీట్లు ఎగరేసుకుపోయారు. మిగిలిన రెండింటిలో కూడా ఒకచోట బీజేపీ, మరోచోట పీఎంకే గెలిచాయి. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే 18 స్థానాలు గెలుచుకున్నా.. ఈసారి ఆ పార్టీని జయయలిత అథఃపాతాళానికి తొక్కేశారు. శారదా చిట్‌ఫండ్ స్కాంతో ప్రతిష్ఠ మసకబారినా.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మూడేళ్లు దాటినా, ప్రభుత్వంపైన.. సీఎం పైన వ్యతిరేకత ఉందని ప్రచారం జరిగినా కూడా మమతా బెనర్జీ తన దమ్మేంటో చూపించారు. వామపక్షాల దుమ్ము దులిపేశారు. పశ్చిమబెంగాల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉంటే, వాటిలో 34 సీట్లను సొంతం చేసుకున్నారు. 2009 ఎన్నికల్లో కేవలం 19 సీట్లే గెలుచుకున్నా, ఈసారి వామపక్షాల ఖాతాలోని మొత్తం 15 సీట్లనూ కొల్లగొట్టి తృణమూల్ బలాన్ని 34కు చేర్చారు. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న రెండు స్థానాలను మాత్రమే లెఫ్ట్‌ఫ్రంట్ గెలుచుకోగలిగింది. మమతా బెనర్జీ కూడా ఘోటక బ్రహ్మచారిణే అన్న విషయం కూడా తెలిసిందే. ఇలా.. ఈసారి ఎన్నికల్లో ఘన విజయాలు సాధించిన నలుగురూ ఒంటరి జీవితాలు గడుపుతున్నవాళ్లే. దీనిపై ఓ పరిశోధన కూడా జరిగింది. ఒంటరి జీవితం గడిపేవాళ్లకు ఎక్కువ సమయం ఉంటుందని, ఇంట్లో ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సులభంగా పనులు చేసుకోగలరని అంటున్నారు. అలాగే ఇంట్లో ఎవరితో గొడవలు కూడా కావు కాబట్టి పని సులభంగా అవుతుందనీ చెబుతున్నారు. అందుకే.. సోలో బతుకే సో బెటరు!!