సాక్షి, హైదరాబాద్: ‘గేమ్ పాయింట్’ తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో అండర్–13 బాలుర సింగిల్స్ విభాగంలో పులి తనూజ్ రెడ్డి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో కొండపర్తి ప్రభాస్‌పై తనూజ్ రెడ్డి విజయం సాధించాడు. తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిది విభాగాల్లో కలిపి మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
తెలంగాణ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబూరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, గేమ్‌పాయింట్ తెలంగాణ స్క్వాష్ చాంపియన్‌షిప్ చైర్మన్ ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.
అండర్–13 బాలుర సింగిల్స్: 1. పులి తనూజ్ రెడ్డి, 2. కొండపర్తి ప్రభాస్.
అండర్–15 బాలికల సింగిల్స్: 1. అర్ణా ద్వివేది, 2. గంజి ధృతి.
అండర్–17 బాలుర సింగిల్స్: 1. రాజ్‌వీర్ గ్రోవర్, 2. రోహన్ అరిగల.
పురుషుల సింగిల్స్: 1. కరణ్ వశిష్‌్ట, 2. రణ్‌వీర్ గ్రోవర్.
మహిళల సింగిల్స్: 1. ఆర్యా ద్వివేది, 2. శాన్వీ శ్రీ.
పురుషుల సింగిల్స్ (ప్లస్ 35): 1. సర్వేశ్ చౌహాన్, 2. సోలీ కొలా.
పురుషుల సింగిల్స్ (ప్లస్ 40): 1. ప్రియతోశ్ దూబే, 2. మయాంక్ మల్హాన్.
పురుషుల సింగిల్స్ (ప్లస్ 45): 1. దానం భరత్, 2. బత్తుల రామ్.
Comments
Please login to add a commentAdd a comment