tanuj
-
రాష్ట్ర స్క్వాష్ టోర్నీ విజేత తనూజ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘గేమ్ పాయింట్’ తెలంగాణ రాష్ట్ర స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో అండర్–13 బాలుర సింగిల్స్ విభాగంలో పులి తనూజ్ రెడ్డి చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో కొండపర్తి ప్రభాస్‌పై తనూజ్ రెడ్డి విజయం సాధించాడు. తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో ఎనిమిది విభాగాల్లో కలిపి మొత్తం 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు బాబూరావు ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్క్వాష్ రాకెట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శ్రీశైలం, గేమ్‌పాయింట్ తెలంగాణ స్క్వాష్ చాంపియన్‌షిప్ చైర్మన్ ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు. అండర్–13 బాలుర సింగిల్స్: 1. పులి తనూజ్ రెడ్డి, 2. కొండపర్తి ప్రభాస్. అండర్–15 బాలికల సింగిల్స్: 1. అర్ణా ద్వివేది, 2. గంజి ధృతి. అండర్–17 బాలుర సింగిల్స్: 1. రాజ్వీర్ గ్రోవర్, 2. రోహన్ అరిగల. పురుషుల సింగిల్స్: 1. కరణ్ వశిష్్ట, 2. రణ్వీర్ గ్రోవర్. మహిళల సింగిల్స్: 1. ఆర్యా ద్వివేది, 2. శాన్వీ శ్రీ. పురుషుల సింగిల్స్ (ప్లస్ 35): 1. సర్వేశ్ చౌహాన్, 2. సోలీ కొలా. పురుషుల సింగిల్స్ (ప్లస్ 40): 1. ప్రియతోశ్ దూబే, 2. మయాంక్ మల్హాన్. పురుషుల సింగిల్స్ (ప్లస్ 45): 1. దానం భరత్, 2. బత్తుల రామ్. -
మీ ప్రేమను బ్రేకప్ చేసుకోండి
సాధారణంగా యువతీయువకులు ప్రేమించుకోవడం ఆ తరువాత ఏదో కారణంగా విడిపోవడం ఇప్పుడు విరివిగా జరుగుతున్న విషయమే. అదేవిధంగా ప్రేమికులను విడదీయడానికి వారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఇక సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. నటుడు కమలహాసన్ మొదటి భార్య, సీనియర్ నటి సారికకు తన కూతురు ప్రేమకు విలన్‌గా మారక తప్పలేదు.ఈమె పెద్ద కూతురు, నేటి టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ అసలు పెళ్లితో పనేంటి అన్నట్లుగా మాట్లాడుతుంటే, రెండో కూతురు, వర్ధమాన నటి అక్షరహాసన్ ప్రేమలో మునిగితేలుతుండడం గమనార్హం. షమితాబ్ అనే ఒకేఒక్క హిందీ చిత్రంతో తెరపైకి వచ్చిన అక్షరహాసన్ అంతకు ముందు తెర వెనుక సహాయదర్శకురాలిగా కొన్ని రోజులు పని చేశారు.అయితే అప్పటి నుంచే అక్షరహాసన్ సీనియర్ నటి రతి కొడుకు తనుజ్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి డేటింగ్ విషయం మీడియాలో హల్చల్ చేసింది. తనుజ్ నటించిన లవ్ యూ సానియో చిత్రం విజయ తీరం చేరలేదు. అటు అక్షరహాసన్ నటించిన షమితాబ్ ఆశించిన విజయం సాధించలేదు. దీంతో వీరిద్దరూ ప్రేమలో మునిగి నటనపై దృష్టిసారించడం లేదన్న విషయాన్ని వారి తల్లులకు సన్నిహితులు ఉప్పందించడంతో నటి సారిక, రతి ఇద్దరూ తమ వారసుల్ని పిలిచి కొంత కాలం మీ ప్రేమకు బ్రేక్ అప్ చెప్పి నటనపై ఏకాగ్రత చూపండి అని హితవు పలికారట. దీంతో అక్షరహాసన్, తనుజ్ తమ ప్రేమను బ్రేక్అప్ చెసుకున్నారని సినీ వర్గాల సమాచారం. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ బాయ్స్ హాస్టల్లో శుక్రవారం ఉదయం ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రకు చెందిన తనూజ్ దేవగన్(20) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం తనూజ్ తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన రూమ్మేట్స్ హాస్టల్ యాజమాన్యానికి తెలిపారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టంనిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తనూజ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండవచ్చునని తెలుస్తోంది.