మీ ప్రేమను బ్రేకప్ చేసుకోండి | Akshara Haasan part ways with boyfriend Tanuj? | Sakshi
Sakshi News home page

మీ ప్రేమను బ్రేకప్ చేసుకోండి

Published Sun, Mar 13 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

మీ ప్రేమను బ్రేకప్ చేసుకోండి

మీ ప్రేమను బ్రేకప్ చేసుకోండి

సాధారణంగా యువతీయువకులు ప్రేమించుకోవడం ఆ తరువాత ఏదో కారణంగా విడిపోవడం ఇప్పుడు విరివిగా జరుగుతున్న విషయమే. అదేవిధంగా ప్రేమికులను విడదీయడానికి వారి తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటారు. ఇక సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. నటుడు కమలహాసన్ మొదటి భార్య, సీనియర్ నటి సారికకు తన కూతురు ప్రేమకు విలన్‌గా మారక తప్పలేదు.ఈమె పెద్ద కూతురు, నేటి టాప్ హీరోయిన్ శ్రుతిహాసన్ అసలు పెళ్లితో పనేంటి అన్నట్లుగా మాట్లాడుతుంటే, రెండో కూతురు, వర్ధమాన నటి అక్షరహాసన్ ప్రేమలో మునిగితేలుతుండడం గమనార్హం.
 
  షమితాబ్ అనే ఒకేఒక్క హిందీ చిత్రంతో తెరపైకి వచ్చిన అక్షరహాసన్ అంతకు ముందు తెర వెనుక సహాయదర్శకురాలిగా కొన్ని రోజులు పని చేశారు.అయితే అప్పటి నుంచే అక్షరహాసన్ సీనియర్ నటి రతి కొడుకు తనుజ్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరి డేటింగ్ విషయం మీడియాలో హల్‌చల్ చేసింది. తనుజ్ నటించిన లవ్ యూ సానియో చిత్రం విజయ తీరం చేరలేదు. అటు అక్షరహాసన్ నటించిన షమితాబ్ ఆశించిన విజయం సాధించలేదు.
 
 దీంతో వీరిద్దరూ ప్రేమలో మునిగి నటనపై దృష్టిసారించడం లేదన్న విషయాన్ని వారి తల్లులకు సన్నిహితులు ఉప్పందించడంతో నటి సారిక, రతి ఇద్దరూ తమ వారసుల్ని పిలిచి కొంత కాలం మీ ప్రేమకు బ్రేక్ అప్ చెప్పి నటనపై ఏకాగ్రత చూపండి అని హితవు పలికారట. దీంతో అక్షరహాసన్, తనుజ్  తమ ప్రేమను బ్రేక్‌అప్ చెసుకున్నారని సినీ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement