సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగుతేజాలు | two telugu stars enters syed modi tournament final | Sakshi
Sakshi News home page

సయ్యద్ మోడీ బ్యాడ్మింటన్ ఫైనల్లో తెలుగుతేజాలు

Published Sat, Jan 24 2015 4:54 PM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM

two telugu stars enters syed modi tournament final

తెలుగుతేజాలు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ మరో సింగిల్స్ టైటిల్కు అడుగు దూరంలో ఉన్నారు. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో  సైనా, శ్రీకాంత్ ఫైనల్కి చేరారు.

శనివారం జరిగిన మహిళల సెమీస్ లో భారత స్టార్ షట్లర్ సైనా 21-10, 21-16 తేడాతో థాయ్లాండ్కి చెందిన నిచోన్ జిండాపాన్పై  నెగ్గింది. మరో తెలుగుతేజం పి.వి.సింధు, స్పెయిన్కు చెందిన కరోలినా మరిన్కు మధ్య జరిగే మరో సెమీస్ మ్యాచ్లో గెలిచిన వారితో సైనా ఫైనల్లో తలపడనుంది. పురుషుల సింగిల్స్ సెమీస్ లో భారత క్రీడాకారుడు కె.శ్రీకాంత్ 12-21, 21-12, 21-14 తేడాతో హెచ్.ఎస్.ప్రన్నోయ్పై విజయం సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement