చెన్నై: భారత్‌లో అతి పురాతన హాకీ టోర్నమెంట్‌లలో ఒకటైన ఎంసీసీ–మురుగప్ప గోల్డ్ కప్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇండియన్ రైల్వేస్ జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. 1901లో తొలిసారి మొదలైన ఈ టోర్నీ ఇప్పటి వరకు 95 సార్లు జరిగింది. ఫైనల్లో రైల్వేస్ జట్టు 5–3 గోల్స్ తేడాతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) జట్టుపై ఘనవిజయం సాధించింది.
రైల్వేస్ తరఫున యువరాజ్ వాలీ్మకి (18వ, 58వ ని.లో) రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా గుర్‌సాహిబ్‌జిత్ సింగ్ 7వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి జట్టుకు శుభారంభమిచ్చారు. రెండు నిమిషాల వ్యవధిలోనే సిమ్రన్‌జ్యోత్ సింగ్ (9వ ని.లో) ఫీల్డ్‌గోల్ చేసి రైల్వేస్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. తర్వాత కాసేపటికి యువరాజ్ చేసిన గోల్‌తో 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
ఎట్టకేలకు ఐఓసీ ఆటగాడు తలీ్వందర్ సింగ్ (23వ ని.లో) చేసిన గోల్‌తో జట్టు ఖాతా తెరిచింది. ఆరు నిమిషాల వ్యవధిలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుజిందర్ సింగ్ (ఐఓసీ) గోల్‌గా మలచడంతో రెండు క్వార్టర్లు ముగిసేసరికి ఐఓసీ 2–3తో రైల్వేస్ ఆధిక్యానికి గండికొట్టింది. కానీ మూడో క్వార్టర్ మొదలైన కాసేపటికే ముకుల్ శర్మ (35వ ని.లో), చివరి క్వార్టర్‌లో యువరాజ్ చేసిన గోల్స్‌తో రైల్వేస్‌కు విజయం ఖాయమైంది. ఐఓసీ తరఫున రాజ్‌బిర్ సింగ్ (58వ ని.లో) గోల్ చేసినా లాభం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment