
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్‌కు మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ ఆరో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4తో టాప్ సీడ్, ఐదుసార్లు మాజీ చాంపియన్ నాదల్‌పై నెగ్గి సెమీఫైనల్ చేరాడు. క్లే కోర్టులపై నాదల్‌పై జ్వెరెకిదే తొలి విజయం కావడం విశేషం. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ సర్వీస్‌ను జ్వెరెవ్ మూడుసార్లు బ్రేక్ చేశాడు.
ఇప్పట్లో బాచ్ ‘టోక్యో’ పర్యటన కష్టమే...
టోక్యో ఒలింపిక్స్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఈ నెలలో జపాన్‌కు రావడం కష్టమేనని ఒలింపిక్ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షురాలు సీకో హషిమోటో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం మే 11 వరకు టోక్యోతోపాటు మరో మూడు నగరాల్లో విధించిన అత్యవసర పరిస్థితిని ఈనెల 31 వరకు ప్రభుత్వం పొడిగించింది. దాంతో థామస్ బాచ్ పర్యటన వాయిదా పడే అవకాశముంది.