మూడో రౌండ్‌లో రుత్విక | Junior shuttlers get past first hurdle in Alor Setar | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో రుత్విక

Published Tue, Apr 15 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 6:02 AM

Junior shuttlers get past first hurdle in Alor Setar

 
 అలోర్ సెటార్ (మలేసియా): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన రుత్విక... సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 21-9, 21-6తో కిట్ లెంగ్ వాంగ్ (మకావు)పై విజయం సాధించింది.

మంగళవారం జరిగే మూడో రౌండ్‌లో నత్సుకి నిదైరా (జపాన్)తో రుత్విక తలపడుతుంది. భారత్‌కే చెందిన రేష్మా కార్తీక్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయింది. రేష్మా 12-21, 16-21తో బ్రిట్నీ టామ్ (కెనడా) చేతిలో ఓటమి పాలైంది.

 ఈ చాంపియన్‌షిప్‌లో పురుషుల, మహిళల విభాగాలలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న వారు ఈ ఏడాది ఆగస్టులో 16 నుంచి 28 వరకు చైనాలో జరిగే యూత్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement