రుత్వికా శివాని ముందంజ
జింఖానా, న్యూస్‌లైన్: ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ రుత్వికా శివాని మూడో రౌండ్లోకి ప్రవేశించింది. విజయవాడలో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రుత్విక 21-1, 21-4తో అనూష (ప్రకాశం)పై విజయం సాధించింది. హైదరాబాదీ క్రీడాకారిణిలు నాలుగో సీడ్ శ్రీకృష్ణప్రియ, పూజ తమ సత్తా చాటారు. కృష్ణప్రియ 21-7, 21-12తో అర్చన (రంగారెడ్డి)పై, పూజ 25-23, 14-21, 21-11తో ఐదో సీడ్ పూర్ణిమపై గెలుపొందారు. వీరితో పాటు పురుషుల సింగిల్స్ విభాగం మొదటి రౌండ్లో అర్జున్ రెడ్డి 21-18, 11-21, 21-14తో గంగాధర రావు(కాకినాడ)ను, వినాయక్ 21-19, 21-11తో అనీత్ కుమార్ (రంగారెడ్డి)ను ఓడించి రెండో రౌండ్లోకి చేరుకున్నారు.
ఇతర ఫలితాలు
పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ ఫలితాలు: లోకేష్ (విశాఖపట్నం) 21-18, 21-13తో రవితేజ (వరంగల్)పై; కిర ణ్ కుమార్ (రంగారెడ్డి) 21-16, 21-18తో మోహన్ సుబ్రమణ్యం (వరంగల్)పై; కనిష్క్ (గుంటూరు) 21-15, 21-10తో చంద్రమౌలి (అనంతపురం)పై; అఖిలేష్ (ఆదిలాబాద్) 21-16, 21-10తో ప్రసాద్ (వరంగల్)పై; సంతోష్ (రంగారెడ్డి) 21-17, 22-20తో రామకృష్ణ (శ్రీకాకుళం)పై; అవినాష్ ( తూర్పు గోదావరి) 21-13, 21-18తో శశిభూషణరావు (చిత్తూరు)పై; రఘునాథ్ (ఆదిలాబాద్) 16-21, 27-25, 21-9తో శ్రీ దత్తాత్రేయ రెడ్డి (కడప)పై, వసీం అక్రమ్ (నెల్లూరు) 21-7, 21-15తో ప్రకాష్ నారాయణ (నల్గొండ)పై; కిషోర్ కుమార్ (కడప) 12-21, 21-12, 21-17తో మనోజ్ (చిత్తూరు)పై; ప్రశాంత్ రెడ్డి (మెదక్) 21-7, 21-10తో గోవిందరావు (విజయనగరం)పై; ప్రవీణ్ (వరంగల్) 21-13, 21-13తో సిరాజ్ (అనంతపురం)పై; అరుణ్ కుమార్ (వరంగల్) 21-9, 21-11తో సందీప్ (వరంగల్)పై; వినోద్ (తూర్పు గోదావరి) 21-13, 21-8తో చైతన్య కృష్ణ (చిత్తూరు)పై; ఉపేంద్ర (కర్నూలు) 21-11, 21-17తో నరేందర్ (ఆదిలాబాద్)పై; చైతన్య (కాకినాడ) 21-12, 21-18తో ఖాజా ఫాజిల్ అహ్మద్ (నల్గొండ)పై; ప్రదీప్ కుమార్ (కర్నూలు) 17-21, 22-20, 21-10తో ఆదిత్య బాపినీడు (ఖమ్మం)పై గెలిచారు.
మహిళల సింగిల్స్ రెండో రౌండ్ ఫలితాలు: దివ్య (తూర్పు గోదావరి) 21-7, 21-7తో అనూష (చిత్తూరు)పై; ఏడో సీడ్ సిరి చందన (మెదక్) 21-10, 21-6తో జాహ్నవి (తూర్పు గోదావరి)పై; మేధాన్విత రెడ్డి (విశాఖపట్నం) 21-23, 21-15, 21-19తో మమిత (రంగారెడ్డి)పై; శ్యామ్ భాను (ఖమ్మం) 12-21, 22-20, 21-17తో లక్ష్మి (వరంగల్)పై; ప్రణవి రెడ్డి ( కరీంనగర్) 21-18, 21-15తో ఎనిమిదో సీడ్ ఉత్తేజ్‌రావు (విశాఖపట్నం)పై; లావణ్య (కాకినాడ) 20-22, 21-17, 21-9తో శ్రావణి (తూర్పు గోదావరి)పై; వైష్ణవి (రంగారెడ్డి) 21-8, 21-8తో నవ్యారావు (తూర్పుగోదావరి)పై; పూజ (చిత్తూరు) 21-5, 21-6తో ప్రఖ్యాతి (మెదక్)పై; సోనికా సాయి (కాకినాడ) 21-3, 21-6తో సాయి శ్రీ (వరంగల్)పై నెగ్గారు.