ఏడు రోజుల శిశువుకు పేస్‌మేకర్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో అరుదైన ఆపరేషన్ జరి గింది. భీమవరానికి చెందిన ఏడు రోజుల శిశువుకు పేస్‌మేకర్‌ను విజయవంతంగా అమర్చారు. దీంతోపాటు సత్తెనపల్లికి చెందిన ఆరేళ్ల బాలుడికి గుండె సర్జరీ అనంతరం ఎక్మో చికిత్స అందించి పునర్జన్మ ప్రసాదించారు. పదిహేను రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక క్యాంపులో భాగంగా యూకేకు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ వైద్యబృందం రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ అరుదైన శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆంధ్రా హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ పీవీ రమణమూర్తి ఇంగ్లండ్ వైద్యులతో కలసి ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ గుండె లోపాలున్న చిన్నారులకు సర్జరీలు చేయాలంటే రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఇంగ్లం డ్‌కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్ చారిటీస్ సహకా రంతో అక్కడి వైద్య బృందంతో ప్రతి మూడు నెలలకోసారి ప్రత్యేక శిబిరం నిర్వహించి చిన్నారు లకు ఉచితంగా గుండె సర్జరీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంలో హైదరాబాద్‌లో పిల్లలకు గుండె సర్జరీలు చేయించుకునే వీలులేక పోవడంతో ఇక క్రమంగా సర్జరీలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 27 నుంచి ఈ నెల 8 వరకూ నిర్వహించిన క్యాంప్‌లో 19 మందికి ఉచితంగా గుండె సర్జరీలు చేశామన్నారు.
ఇలా ఇప్పటివరకూ ఇంగ్లండ్ వైద్యులచే 135 మంది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయగా, తమ వైద్యులు 55 మంది చిన్నారులకు నిర్వహించారని, మొత్తం 190 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు వివరించారు. సమా వేశంలో ఆంధ్రా హాస్పిటల్స్ పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పాతూరి వెంకటరామారావు, ఇంగ్లండ్‌కు చెందిన పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కుడుముల రామారావు, íపీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సిమోనా, ఇంటెన్సివ్ నిపుణుడు డాక్టర్ రెయినీస్, నైనా, గైల్ రాజోస్, మిర్జానా, ట్రేసీ, ఫియోనావుడ్‌లతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.