విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఉద్యాన ప్రదర్శన 2016 ను విజయవాడలో నిర్వహిస్తున్నట్టు ఏపీఎంఐపీ ప్రాజెక్టు కృష్ణా జిల్లా డెరెక్టర్ పి.వి.ఎస్.రవికుమార్ బుధవారం తెలిపారు. ప్రదర్శన ఈ నెల నెల 23 నుంచి 25 వరకు జరగనుంది. 23 న సీఎం చంద్రబాబు ప్రదర్శనను ప్రారంభిస్తారని చెప్పారు. సూక్ష్మసేద్య పద్ధతులు, పండ్లు, కూరగాయలు, సుగంద ద్రవ్యాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. నర్సరీలు, అలంకరణ మొక్కలు, టిష్యూ కల్చర్, విత్తనాలు, కోల్డ్‌స్టోరేజీలు, గ్రీన్ హౌస్‌లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, యంత్ర పరికరాల వినియోగంపై ప్రదర్శన, అమ్మకాలు, ఇతర సమాచారాన్ని ఔత్సాహిక రైతులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
23 నుంచి ఉద్యాన ప్రదర్శన
Published Wed, May 18 2016 7:56 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement