విజయవాడ: ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాను చంద్రబాబు సర్కారు కాలరాసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా విజయవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు గురువారం నగర పాలక సంస్థ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయన్నారు. తిరుమల వెంకన్న సాక్షిగా మోదీ ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. మోదీ ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.