ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్తో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం జాతీయ నాయకులను కలిశారు.
శరద్యాదవ్, నితీశ్కుమార్,శరత్ పవార్లను కలసి ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ పూర్తి మద్దతుంటుందని తెలిపారు. ఏపీతో పాటు బిహార్కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు నితీశ్ వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా కోసం చేసినా కోటి సంతకాలను ప్రధాని మోదీకి సమర్పిస్తారు.