'కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారు' | raghuveera reddy criticises chandra babu for special status and other issues | Sakshi
Sakshi News home page

'కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారు'

Published Fri, Mar 11 2016 9:35 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారు' - Sakshi

'కేంద్రంతో చంద్రబాబు రాజీపడ్డారు'

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా అమలు కోరుతూ రేపు ఢిల్లీకి ఏపీ పీసీసీ రఘువీరారెడ్డి వెళ్లనున్నారు. ప్రత్యేక హోదా అమలు డిమాండ్ తో చేపట్టిన కోటి సంతకాలను ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పిస్తామని రఘువీరా తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్ట హామీల అమలులో కేంద్రం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి బయట పడేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావట్లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తీవ్రంగా విమర్శించారు.

కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన ప్రయోజనాలపై చంద్రబాబు రాజీపడ్డారంటూ ఆయన మండిపడ్డారు. ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులు 300 మంది కాంగ్రెస్ నేతలు విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం అందింది. 14,15,16 తేదీల్లో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement