National Leaders
-
2024 LS polls: సగానికిపైగా ఓట్లు మనకే పడాలి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ పార్టీ పదాదికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి మరిన్ని ఓట్లను ఒడిసిపట్టాలని పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్టీ జాతీయ పథాధికారుల సమావేశం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు సాగిన ఈ సమావేశం శనివారం ముగిసింది. నేషనల్ ఆఫీస్ బేరర్స్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర సంస్థాగత విభాగాల సారథులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చకొచి్చన ఇతరత్రా అంశాలను విశ్వసనీయ వర్గాలు శనివారం వెల్లడించాయి. ‘‘త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో సగానికిపైగా ఓట్లు బీజేపీకే దఖలుపడాల్సిందే. పోలింగ్‌లో పార్టీ ఓటు షేర్ కనీసం 10 శాతమైనా పెరగాల్సిందే. 2019లో బీజేపీ 37శాతానికిపైగా ఓటు షేరు సాధించింది. ఎన్డీఏ కూటమి దాదాపు 45 శాతం ఓటుషేరు సాధించింది. 2014 నుంచి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు ఒక్క బీజేపీకే పడ్డాయి. దృఢ కార్యదీక్షతో ఎన్నికల క్షేత్రంలో అవిశ్రాంతంగా పనిచేయండి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన చోట్ల మన పార్టీ విజయభేరీ మోగించాలి. ఆ బాధ్యత మీదే. జనం మెచి్చన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చొచ్చుకుపొండి. తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేసే విపక్ష పారీ్టల ఆటకట్టించండి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టులు, పనులు, వాస్తవ గణాంకాలతో ప్రజలకు నిజానిజాలకు తెలియజెప్పండి’’ అని బీజేపీ నేతలకు మోదీ సూచించారు. నాలుగు ‘కులాలను’ కలుపుకొని పొండి ‘దేశంలో నాలుగే కులాలున్నాయి. మహిళలు, యువత, రైతులు, పేదలు. ప్రచారంలో భాగంగా ఈ నాలుగు కులాలను కలిసి వారి కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నంచండి. అద్భుత ఫలితాలు, ప్రజాదరణ పొందిన కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని మోదీ సూచించారు. కేంద్రంలో బీజేపీ హయాంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, వాటి లబ్ధిదారుల విజయగాథలను తెల్సుకుంటూ, ప్రజల్లో పథకాల అవగాహన పెంచుతూ ముందుకు సాగుతున్న ‘ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను మరింతగా విజయవంతంగా చేయడంపైనా సమావేశంలో నేతలు చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకలను మరింత బాగా నిర్వహించడం, తదితరాలూ సమావేశంలో చర్చకొచ్చాయి. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నమోదైన విజయం.. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విజయానికి శుభసూచకమని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారని వార్తలొచ్చాయి. బూత్ కమిటీలను పటిష్టవంతంచేస్తేనే ఎక్కువ మంది ఓటర్లను మనం చేరుకోగలమని నేతలు చెప్పినట్లు వార్తలొచ్చాయి. ‘‘మూడు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాం. ఇక సార్వత్రిక సమరంలోనూ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం’’ అని నేతల ముందు మోదీ విశ్వాసం వ్యక్తంచేశారని తెలుస్తోంది. ‘‘మన ప్రదర్శన చూసి విపక్షాలు కంగుతినాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారట. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు పార్టీని పొగుడుతూ ప్రసంగించారు. వచ్చే నెలలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవం సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టకి బాగా కలిసొస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు. -
తెలంగాణలో ముగిసిన బీజేపీ అగ్రనేతల ప్రచారం
-
తెలంగాణలో బీజేపీ ప్రచార హోరు
-
రాష్ట్రంలో ఐదు రోజుల పాటు జాతీయ నేతల సందడి
-
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించండి
సాక్షి, అమరావతి: చంద్రబాబు అరెస్టయినా జాతీయ పార్టీల నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఎలాగైనా వారితో మాట్లాడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నేతలు లాబీయింగ్ చేసి మరీ స్పందించాలని కోరడంతోనే పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, అకాలీదళ్ నేత సుఖబీర్‌సింగ్ బాదల్ స్పందించినట్టు తెలుస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు అరెస్టయి నాలుగురోజులైనా ఆయనకు జాతీయ స్థాయిలో కనీసమద్దతు లభించలేదు. ఎవరూ స్పందించకపోవడంతో పలువురు టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల నేతలతో లాబీయింగ్ చేస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి రామ్మోహనరావు ఢిల్లీలో తనకు తెలిసిన వారందరినీ కలిసి చంద్రబాబు అరెస్ట్‌పై మాట్లాడాలని కోరుతున్నట్టు తెలిసింది. తనకు తెలిసిన ఎంపీల ద్వారా మమతా బెనర్జీని బతిమలాడటంతో ఆమె మొక్కుబడిగా స్పందించారు. అఖిలేశ్‌ను కూడా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది. సుఖబీర్‌సింగ్ బాదల్ కూడా లాబీయింగ్ వల్లే మూడురోజుల తర్వాత స్పందించారు. పట్టించుకోని జాతీయ పార్టీలు వివిధ జాతీయపార్టీలు, నేతలతో చంద్రబాబుకు సంబంధాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను ఎప్పుడూ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు, అవకాశవాదం కోసం ఉపయోగించడంతో ఆయన నమ్మదగని నేతగా ముద్రపడ్డారు. ప్రస్తుతం అన్ని పార్టీలు ఆయన్ను దూరం పెట్టాయి. అటు ఎన్డీయే దగ్గరకు రానీయడం లేదు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కూడా ఆయన్ను పట్టించుకోవడం లేదు. ఏ కూటమిని అయినా తన రాజకీయ అవసరాల కోసమే వాడుకోవడంతో ఇప్పుడు ఆయన దేశ రాజకీయాల్లో ఏకాకిగా మారిపోయారనే వాదన వినిపిస్తోంది. మద్దతు కోసం ఢిల్లీలో లాబీయింగ్ చంద్రబాబు అనుయాయుడు కంభంపాటి, బీజేపీలోని ఆయన కోవర్టులు సీఎం రమేష్, సుజనాచౌదరి వంటి నేతలు చంద్రబాబుకు అనుకూలంగా లాబీయింగ్‌కు దిగారు. అయినా ఆశించినస్థాయిలో జాతీయనేతలు చంద్రబాబుకు మద్దతు పలకలేదు. కనీసం మరికొంత మందితో అయినా ట్వీట్లు చేయించాలనే ఉద్దేశంతో ఢిల్లీలో తంటాలు పడుతున్నట్టు తెలుస్తోంది. -
అగ్రనేతలను మోహరించిన బీజేపీ..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ఈ సాయంత్రం ముగిసింది. గత నెల రోజులుగా అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించి.. ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ సహా అగ్రనేతలందరినీ ఎన్నికల ప్రచారబరిలో దింపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, నలుగురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 10మంది కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ 3 సభలు నిర్వహించగా, అమిత్‌షా 9 సభలు, రెండు రోడ్ షోలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ 8 సభలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్ 2 సభలు, నితిన్ గడ్కరీ 4 సభలు, స్మృతి ఇరానీ, సుష్మాస్వరాజ్, రమణసింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, శివరాజ్ సింగ్ చౌహన్, ముక్తర్ అబ్బాస్, షాన వాజ్ హుస్సేన్, పురుషోత్తం రూపాలు ఒక రోజు పర్యటనలు చేశారు. రాం మాధవ్, జుయల్ ఓరం, పురందేశ్వరి, జేపీ నడ్డా, హన్సరాజ్ గంగారాంలు పలు సార్లు పర్యటించారు. బీజేపీ ప్రతి నియోజగవర్గంలో రెండు సభలు నిర్వహించింది. మొత్తం జాతీయ నాయకులు దాదాపుగా 90 సభలు నిర్వహించారు. స్వామీ పరిపూర్ణానంద దాదాపుగా 90 సభలు నిర్వహించారు. -
ఎరుపెక్కిన కడప
కడప వైఎస్ఆర్ సర్కిల్:కడప నగరంలో తొలిసారిగా జరగనున్న సీపీఐ 26వ రాష్ట్ర మహాసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మహాసభల సం దర్భంగా నగరంలోని ప్రధాన సర్కిళ్లన్నీ ఎరుపెక్కాయి. ఈ మహా సభలకు సీపీఐ జాతీయ నేతలు తరలిరానున్నారు. శుక్రవారం నుంచి మహా సభలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మహా సభల షెడ్యూల్ తదితర విషయాల గురించి వెల్లడించారు. సభల్లో ఏమేం చర్చిస్తారంటే.. ఈ మహాసభలో జిల్లాలో ఉక్కు పరి శ్రమ నిర్మాణం, రాష్ట్రానిక ప్రత్యేకహోదా, వెనుకబడిన రాయలసీమకు ప్రత్యే క ప్యాకేజీ, కరువు వలసలు, రైతుల ఆత్మహత్యలపై, రాష్ట్రానికి ప్రాజెక్టులకు నిధులు, నికరజలాలు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలో బీసీ మైనార్టీలకు చట్టబద్ధత వంటి వాటిపై చర్చిస్తామన్నారు. భూమి లేని దళిత గిరి జనులకు 5 ఎకరాల భూమి కోసం పోరాటం చేస్తామన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ క్రమబద్ధీకరణ తదితర విషయాల పోరాటం, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎందరో మహనీయులు జాతీయ ఉద్యమ కాలంలోనే జిల్లాలో కమ్యూనిస్టుపార్టీ ఆవిర్భావానికి బీజాలు పడ్డాయి. ఎంతోమంది విద్యావంతులైన యువకులు ఉద్యమంలోకి వచ్చారు. ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, నర్రెడ్డి శివరామిరెడ్డి, శంభురెడ్డి, నంద్యాల నాగిరెడ్డి, ఎన్.ఈశ్వర్‌రెడ్డి, జె.వెంకట్రామి రెడ్డి, కె.సుబ్బన్న, చెంచురామయ్య, కమ్మూ సోదరులు వంటి ఎందరో మహనీయులు తమ జీవితాలను పార్టీకి అంకితం చేశారు. మరువలేని ఘట్టాలు అజ్ఞాత జీవితాన్ని గడుపుతున్న ఎద్దుల ఈశ్వర్‌రెడ్డిని ఎలాగైనా అరెస్టు చేయాలన్న పోలీసులు ఆయన స్వగ్రామం పెద్ద పసుపులను చుట్టుముట్టారు. పోలీసులు ఈశ్వర్‌రెడ్డిని పట్టుకుని వ్యాను ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా, గ్రామం మొత్తం ఏకమై అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పోలీసు కాల్పుల్లో పెద్ద వెంకట కొండారెడ్డి అమరులయ్యారు. కాలక్రమంలో జరిగిన ఎన్నికల్లో కమలాపురం నుంచి నర్రెడ్డి శివరామి రెడ్డి, రాజంపేట నుంచి పంజం నరసింహారెడ్డి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి ఒకసారి శాసనమండలి సభ్యునిగా, వరుసగా నాలుగుసార్లు కడప లోక్‌సభ సభ్యునిగా ఎన్నిక కావడం విశేషం. మహా సభల షెడ్యూల్ ఇదే 6న ఉదయం 10 గంటలకు సొదుం జయరాం వేదికపై (మానస గార్డెన్‌లోని కాన్పరెన్స్ హాల్) ‘ఆర్థిక సంక్షోభం–సామాన్యుల స్థితి గతులు’ అనే అంశంపై కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, అరసం రాష్ట్ర అధ్యక్షుడు రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొంటారు. ≈ ఉదయం 11:30 గంటలకు ప్రమాదంలో ప్రజాస్వామ్యం కార్యక్రమం ఉంటుంది. ≈ మధ్యాహ్నం 2:30 గంటలకు వై.సి.వి రెడ్డి వేదికపై వర్తమాన సమాజం– వివక్ష అనే అంశంపై సమావేశం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రము ఖ కథా రచయిత వేంపల్లి గంగాధర్, ఈశ్వరరెడ్డి హాజరవుతారు. ≈ సాయంత్రం 4 నుంచి 5:30 గంటలకు కమ్మూ సాహెబ్ అండ్ శ్యామల వేదికపై (నేక్‌నామ్ కళాక్షేత్రం)లో సాంస్కృతిక సంక్షోభం అం శంపై చర్చ ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీ విమర్శకులు పి.సంజీవమ్మ, ప్రముఖ కథా రచయిత హుస్సేన్ సత్యాగ్ని తవ్వా ఓబుల్‌రెడ్డి హాజరవుతారు. ≈ 7న సాయంత్రం 3 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి 4 గంటలకు మున్సిపల్ గ్రౌండ్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యదర్శి కె. నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్ బాషాతో పలువురు రాష్ట్ర నాయకులు హాజరవుతారు. ≈ 8,9 తేదీల్లో ప్రతిధులు సభలు, 10న రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉంటుం దని ఆయన వివరించారు. -
అశ్రునివాళి
కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు - కన్నీళ్లుపెట్టిన పన్నీర్ సెల్వం, శశికళ ఓదార్చిన ప్రధాని మోదీ - రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివాళి - అంత్యక్రియలకు హాజరైన జాతీయ నేతలు, వైఎస్సార్సీపీ ప్రతినిధులు సాక్షి, చెన్నై: పురచ్చితలైవీ జయలలితకు నివాళులర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవారం చెన్నైకు తరలివచ్చారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి ‘అశ్రు’నివాళులర్పించారు. అమ్మ భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌కు తీసుకువచ్చినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు సందర్శించారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.15 సమయంలో రాజాజీ హాల్‌కు చేరుకుని జయలలిత పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. మోదీ అక్కడికి రాగానే తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం కొంత ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన్ని మోదీ ఆలింగనం చేసుకుని ఓదార్చారు. అలాగే జయలలిత నెచ్చెలి శశికళను మోదీ పరామర్శించారు. ఆమె తలపై ఆప్యాయంగా చేరుు వేసి ఓదార్చారు. అక్కడే ఉన్న జయలలిత అన్న జయకుమార్ కుమారుడు దీపక్‌ను పరామర్శించారు. తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాకు తెలిపారు. అనంతరం మూడున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడికి చేరుకుని జయలలిత పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జయలలిత భౌతికకాయానికి నివాళులర్పించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, తమ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో కలసి జయలలిత భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆమె లేని లోటు అన్నాడీఎంకే వర్గాలకు తీర్చలేనిదని, పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని స్టాలిన్ మీడియాతో పేర్కొన్నారు. జయకు నివాళులర్పించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేరళ సీఎం విజయన్, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్, మాజీ గవర్నర్ రోశయ్య, వైఎస్సార్సీపీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వరప్రసాద్ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు హాజరయ్యారు. ఇక, దక్షిణభారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి ప్రేమలత, అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్యలతో కలసి జయలలిత పార్థివదేహం వద్ద నివాళులర్పించారు. జయలలిత మరణవార్త విని తమిళనాడులో 36 మంది మృతి సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణవార్త విని తమిళనాడులో 36 మంది మరణిం చారు. వీరిలో 31 మంది గుండె పోటు తో మరణించగా, ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవా రం రాత్రి నుంచి దిగాలుగా ఉన్న అరుం బు కోటైకి చెందిన సుబ్బురాజ్ (42) అనే అన్నాడీఎంకే కార్యకర్త మంగళ వారం ఉదయం విధులకు హాజరై అక్కడి తోటలోని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేదార ణ్యంకు చెందిన కాలియప్పన్ (77) అనే అన్నాడీఎంకే సభ్యుడు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కోయం బత్తూరు హరిజన కాలనీకి చెందిన వడివేలు అనే డ్రైవర్ ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేలూరు సామివేల్ నగర్‌కు చెందిన పేరరసు, ఆరణికి చెందిన సురేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఇక కేంద్ర పథకాలకు ముందు ‘పీఎం’!
న్యూఢిల్లీ: అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు ముందు ప్రధానమంత్రి(పీఎం) అనే పేరును జత చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఒకవేళ పీఎం అని కాకుంటే జాతీయ నేతల పేర్లను జతచేసే అవకాశముంది. అలాగే, మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వాటిని అన్ని సినిమా హాళ్లలో చిత్ర ప్రదర్శనకు ముందు చూపాలన్న నిబంధనను తప్పనిసరి చేయనున్నారు. ఈమేరకు కేంద్ర పథకాలు, విజయాలను రాష్ట్రాల్లో, జిల్లాల్లో తెలియపరిచేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు నేతృత్వంలోని మంత్రుల బృందం(జీఓఎం) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి అమలు బాధ్యతను సమాచార, ప్రసార శాఖకు అప్పగించాలంది. ప్రభుత్వ విజయాలపై రెండు వారాలకో చిత్రాన్ని రూపొందించాలని సూచించింది. కేంద్ర పథకాల ద్వారా వచ్చే గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వాలే పొందుతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆ పథకాల ప్రారంభోత్సవాల్లో కేంద్ర మంత్రులు, ఎంపీలు ఉండాలంది. పథకాల అమలును పర్యవేక్షించే బాధ్యతలను స్థానిక ఎంపీలకు కట్టబెట్టాలని తెలిపింది. పథకం అమలులో నిర్లక్ష్యం చేస్తే జరిమానా విధించే అధికారం ఇవ్వాలని పేర్కొంది. -
జాతీయ నాయకులను కలిసిన రఘువీరా బృందం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నేతల బృందం జాతీయ నాయకులను కలిశారు. శరద్‌యాదవ్, నితీశ్‌కుమార్,శరత్ పవార్లను కలసి ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ పూర్తి మద్దతుంటుందని తెలిపారు. ఏపీతో పాటు బిహార్‌కు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు నితీశ్ వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఇతర ముఖ్య నేతలను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ప్రత్యేక హోదా కోసం చేసినా కోటి సంతకాలను ప్రధాని మోదీకి సమర్పిస్తారు. -
రాజధాని శంకుస్థాపనకు రండి
* జాతీయ నేతలు, ప్రముఖులకు సీఎం ఆహ్వానం * 22న ప్రధానమంత్రి వస్తామన్నారు : చంద్రబాబు * జగన్, కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నా * సోనియాగాంధీకి ఆహ్వానం పంపించా * రాజధాని నిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రావాలంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం పలువురు జాతీయ నేతలు, ప్రముఖులను ఆహ్వానించారు. స్వచ్ఛభారత్ సబ్ గ్రూప్ కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు.. ఈ విభాగం రూపొందించిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసేందుకు బుధవారం ఢిల్లీకి వచ్చారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అయ్యారు. రాజధాని శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రానికి చెందిన పెండింగ్ అంశాలపైన చర్చించారు. శంకుస్థాపనకు రావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తును ఆహ్వానించారు. అనంతరం ఏపీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 22వ తేదీన జరిగే రాజధాని శంకుస్థాపనకు వస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారన్నారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని కూడా కలిసినట్లు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సహా అందరినీ ఆహ్వానిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆహ్వానం పంపామని చెప్పారు. నా రాజధాని, మన రాజధాని అన్న భావన రావాలని, ప్రజలంతా ఇందులో భాగస్వాములు కావాలని అన్నారు. శంకుస్థాపనకు దేశంలోని అన్ని పుణ్య క్షేత్రాలు, నదుల నుంచి నీరు, మట్టి తెస్తామని, దీన్నొక పవిత్ర సంగమంగా చేస్తామనిఅన్నారు. అమరావతి ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటి కావాలని అన్నారు. ప్రజల అలవాట్లలో మార్పు రావాలి స్వచ్ఛ భారత్ మిషన్ విజయవంతమ్వాలంటే నిధుల్లో 20 శాతం పైనే ఖర్చు చేసి, ప్రజల్లో అవగాహన పెంచాలని బాబు చెప్పారు. ప్రజల అలవాట్లలో మార్పు రావాలన్నారు. స్వచ్ఛ భారత్ కోశ్ ఫండ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకు పెట్రోల్, డీజిల్, టెలికాం సర్వీసులపై సెస్ వేయొచ్చని సూచించినట్లు చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నిధులను ఈ మిషన్‌కు వెచ్చించాలని కోరామాన్నారు. వ్యర్థాల నిర్వహణను ఒక సమీకృత వ్యవస్థలా రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై చర్చించాం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక సాయం అందించేందుకు నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ రూపొందిస్తుందని చెప్పారు. ‘‘నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ అమెరికాలో ఉన్నారు. ఈరోజు ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి నృపేందర్ మిశ్రాకు గుర్తు చేశాం. దీనిపై వర్కవుట్ చేస్తామన్నారు’’ అని తెలిపారు. ఇప్పటివరకు ఈ దిశగా ఒక్క సమావేశం కూడా జరగలేదని గుర్తు చేయగా.. వారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అని బదులిచ్చారు. కేంద్ర హోంమంత్రి, ఆర్థిక మంత్రితో పెండింగ్ అంశాలపై చర్చించామన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీపై కూడా చర్చించామని చెప్పారు. ప్రధాని నుంచి ఎలాంటి సానుకూల ప్రకటనను ఆశిస్తున్నారు అని ప్రశ్నించగా ‘‘ఆంధ్రప్రదేశ్ పసిబిడ్డ. ఒక్కో సమస్యను అధిగమించి అనేక సంస్థలను సాధించుకున్నాం. కొన్ని మనం ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. -
25 నుంచి 29 వరకు విశ్వ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాయదుర్గంలోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో డిసెంబర్ 25 నుంచి 29వ తేదీ వరకు విశ్వ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ (పశ్చిమ) ప్రాంత అధ్యక్షుడు ఎం.రామారాజు, ప్రాంత పీఠ మందిర ప్రముఖ్ కిష్టంపల్లి నర్సింహారావు తెలిపారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రామరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు విశ్వసమ్మేళనానికి హాజరుకానున్నారని తెలిపారు. డిసెంబర్ 28వ తేదీన ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగసభ ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా రామ్‌దేవ్‌బాబా హాజరవుతారని తెలిపారు. ఈనెల 29న(శనివారం) నల్లకుంట శివంరోడ్‌లోని షిర్డీ సాయిబాబా మందిరంలో ఆలయ ధర్మకర్తల పాలక మండలి సమ్మేళనం, మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ అర్చకులు, పురోహితుల సమావేశం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో అర్చక పురోహితులకు జీతాలు సక్రమంగా అందడంలేదని, లక్షలాది ఎకరాల దేవుడి మాన్యాలు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల పరిరక్షణకు ధార్మిక పురోహిత చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీ సంస్థలకు ఇస్తున్న ప్రాధాన్యం హిందూ సంస్థలకు ఇవ్వడం లేదని విమర్శించారు. సమావేశంలో ప్రాంత ధర్మాచార్య, సంపర్క ప్రముఖ్ నారాయణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
మెతుకుసీమలో నేతల దౌడ్
- ఒకే రోజు పోటెత్తిన అగ్ర నాయకులు నర్సాపూర్‌లో సుష్మా.. - సంగారెడ్డిలో ఆజాద్ నారాయణఖేడ్, జహీరాబాద్, - జోగిపేటలో కేసీఆర్ - జహీరాబాద్‌లో చంద్రబాబు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల వేళ మెతుకుసీమకు అగ్రనాయకులు పోటెత్తారు. పోలింగ్‌కు కేవలం మూడే రోజులు మిగిలి ఉండటంతో జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు జిల్లాకు వరుస కట్టారు. కుదిరితే హెలికాప్టర్లో.. లేకుంటే రోడ్డు మార్గంలో ‘దౌడ్’ తీస్తున్నారు. శనివారం బీజేపీ జాతీయ నాయకురాలు సుష్మాస్వరాజ్ నర్సాపూర్‌లో పర్యటించారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నారాయణఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు గులాంనబీ ఆజాద్ సంగారెడ్డి నియోజకవర్గంలో తిరిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జహీరాబాద్‌లో పర్యటించారు. రాజకీయ అనిశ్చితిలో కేసీఆర్: సుష్మాస్వరాజ్ నర్సాపూర్ సభలో సుష్మాస్వరాజ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కేసీఆర్ మీద విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేయడం చూస్తుంటే రాజకీయ అనిశ్చితిలో కూరుకుపోయినట్టు అర్థమవు తుందన్నారు. ‘రాష్ర్టంలో టీఆర్ఎస్ వస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు, లేకుంటే కేంద్రంలో మంత్రి పదవి తీసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆయన కలలు నేరవేరవు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రాదు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావడం ఖాయం. ఆంధ్రకు నీళ్లను ఇవ్వను అని పంచాయితీ పెట్టుకునే బదులు నదీ జలాలను తెలంగాణకు ఏవిధంగా వినియోగించుకోవాలో ఆలోచన చేస్తే మంచిది’ అని ఆమె అన్నారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిష్టర్: కేసీఆర్ జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పర్యటించిన కేసీఆర్ మాజీ మంత్రి గీతారెడ్డి మీద విరుచుకుపడ్డారు. గీతారెడ్డి ఫైవ్‌స్టార్ మినిష్టర్ అని, ఆమె సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరని విమర్శించారు. త్వరలోనే జైలుకు వెళ్లబోయే గీతారెడ్డికి ఓటు వేస్తే దండగేనని జహీరాబాద్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. అందోల్‌లో కేసీఆర్ వచ్చే సమయానికి సభా వద్ద జనం పలుచగా ఉండటంతో ఆయన కేవలం నాలుగే నిమిషాలు ప్రసంగించారు. ఎన్నికల తర్వాత టీఆర్ఎస్.. బీజేపీతో కలవదని తేల్చి చెప్పారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. మరోసారి అవకాశం ఇవ్వండి: ఆజాద్ సంగారెడ్డిలో గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ.. సెక్యులర్ భావాలు కలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని జగ్గారెడ్డి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, ఐఐటీ తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. మరో మారు అవకాశం ఇస్తే మెట్రో రైలు కూడా పట్టుకొస్తారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు. -
పొత్తు సీట్లపై అయోమయం
సీట్లు ఖరారు చేయకుండా తాత్సారం వచ్చే సీటేదో... పోయే సీటేదో తెలియక నేతలు తికమక సాక్షి, విజయవాడ : టీడీపీతో పొత్తు సీమాంధ్రలోని బీజేపీ నేతలకు తలనొప్పిలా మారింది. ఆదినుంచీ వారు పొత్తు వద్దని మొత్తుకున్నా జాతీయ నేతలు సిద్ధపడడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అంగీకరించారు. పొత్తులో భాగంగా సీమాంధ్రలోని ఐదు పార్లమెంట్, 15 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు తొలుత అంగీకరించినా.. ఇప్పుడు నాలుగు పార్లమెంట్, 15 అసెంబ్లీ స్థానాలకు బీజేపీని పరిమితం చేశారు. ఈ మార్పుకు అనుగుణంగా బీజేపీకి ఇచ్చే సీట్లను ఖరారుచేయకుండా ఆ పార్టీ నేతలకు చంద్రబాబు చుక్కలు చూపిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రెండు రోజులు గడిచినా బాబు సీట్ల ప్రక్రియను తేల్చకపోవడంతో బీజేపీ నేతలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. చివరి నిమిషం వరకు ఇలా నాన్చితే అభ్యర్థులను వెదుక్కోవడం కూడా కష్టమవుతుందని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు వీరేనా.. తొలుత అరకు, విశాఖపట్నం, నర్సాపురం, తిరుపతి, రాజంపేట సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ ముందుకొచ్చినట్లు సమాచారం. తాజాగా వీటిలోనూ చంద్రబాబు మార్పులు చేశారు. అరకు స్థానాన్ని మార్పుచేసి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు తాజాగా టీడీపీ అంగీకరించింది. నర్సాపురం సీటు బదులుగా కాకినాడ ఎంపీ సీటు బీజేపీకి దక్కుతుంది. ఇక్కడినుంచి సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు పోటీచేయవచ్చు. ఇక కడప జిల్లా రాజంపేట స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె అక్కడినుంచి పోటీచేయడానికి అంగీకరించకపోతే రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలున్నాయి. విశాఖపట్నం ఎంపీ స్థానం కంభంపాటి హరిబాబుకే కేటాయించేందుకు పార్టీ వర్గాలు మొగ్గుచూపుతున్నాయి. తిరుపతి నుంచి బీజేపీ తరఫున పారిశ్రామికవేత్త బరిలో దిగే అవకాశాలున్నాయి. ఒంగోలు సీటు కోరినా దాన్ని కేటాయించకపోవడంపై బీజేపీ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. నర్సాపురం సీటును పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజుకు ఇవ్వాలని బీజేపీ భావించింది. ఇప్పుడా సీటు మార్పుచేసి కాకినాడ ఇవ్వడంతో బీజేపీలో ఒక వర్గం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ సీట్ల పరిస్థితీ అంతే.. పదిహేను అసెంబ్లీ సీట్ల విషయంలోనూ బీజేపీకి ఇంకా స్పష్టత రాలేదు. ఆయా స్థానాల్లో ఆ పార్టీకి ఇంకా అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొంది. ఇక్కడ బీజేపీకి మూడు శాతం కంటే తక్కువ ఓటింగే ఉంది. ఇప్పటికే ఇస్తారని భావిస్తున్న సీట్లలో విజయవాడ సెంట్రల్, నరసరావుపేట, నర్సన్నపేట వంటి సీట్లు మార్చుతారంటూ ప్రచారం జరుగుతోంది. సెంట్రల్ సీటుకు బదులు వెస్ట్ సీటు బీజేపీకి ఇస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలంపల్లి దూకేసి బీ-ఫారం తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. నరసరావుపేటలో ఒక పారిశ్రామికవేత్తకు బీజేపీ సీటు లభించే అవకాశం ఉందని తెలిసింది. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటివరకు సమర్ధుడైన అభ్యర్థి కమలనాథులకు దొరకలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
జగన్ ఒక్కడే ఒక సైన్యం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం రాజకీయాలలో తలపండిన వారిని సైతం ఆశ్చర్య పరుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ది కోసం ఏకపక్షంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జాతీయస్థాయిలో పార్టీ నేతల్ని కలిసి మద్దతు కూడగడుతున్న విషయం తెలిసిందే. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే వామపక్ష, బీజేపీ పార్టీ నేతల్ని ఢిల్లీలో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీని కొలకత్తాలో కలిసిన జగన్, త్వరలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ని కలవనున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం, అఖిలేశ్ యాదవ్‌ని నేడు (గురువారం) కలవాల్సి ఉండగా, ఆ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా, సంఖ్యాపరంగా చూస్తే, నామినేటెడ్ సభ్యులిద్దరితో కలిపి 545 మంది ఉండే లోక్‌సభలో తనతో కలిపి ఇద్దరు (మరొకరు మేకపాటి రాజమోహన రెడ్డి) మాత్రమే ఉన్న అతి చిన్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అయిన జగన్, 203 ఎంపీల బలంతో, రాజకీయపుటెత్తులు, రణతంత్రపు జిత్తులతో చలాయించుకొస్తున్న కాంగ్రెస్ పార్టీకీ, దాని నేతృత్వంలోని యుపిఎ కూటమికి ముచ్చెమటలు పోయిస్తున్నారు. సొంత రాజకీయ ప్రయోజనాలే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని ముక్కలు చేస్తుందని, రేపు డిల్లి గద్దె మీద యువరాజు రాహుల్ గాంధీని కూర్చోబెట్టడానికే కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ పూనుకున్నారని జగన్ పదే పదే చాటారు. రాష్ట్రాలను తన ఇష్టారాజ్యంగా విభజించే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా చేజిక్కించుకోబోతున్న కాంగ్రెస్ వైఖరిలోని అప్రజాస్వామ్యాన్ని జాతీయ పార్టీల దృష్టికి ఆయన తీసుకు వచ్చారు. 25 మంది సభ్యుల వామపక్ష కూటమిలో, 16 మంది సభ్యుల సిపీఎం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. నలుగురు సభ్యులున్న సిపీఐకి రాష్ట్ర విభజనపై భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, ఆర్టికల్ 3ని కాంగ్రెస్ దుర్వినియోగ పరిస్తే అవకాశాలపై జగన్ వెలిబుచ్చిన ఆందోళనని ఆ పార్టీ అర్థం చేసుకోవడమే కాకుండా, అటువంటి దుర్వినియోగాన్ని తప్పకుండా అడ్డుకుంటామని జగన్‌కు హామీ ఇచ్చింది. ఇంతకు మించి జగన్ సాధించిన మరో ముఖ్యమైన విజయం, ప్రత్యేక తెలంగాణాకు మొదటుంచీ సుముఖంగా ఉన్న బీజేపీని పునరాలోచన దిశగా మళ్లించడం. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి అనుకూలం అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాని వేరు చేయడం వెనక కాంగ్రెస్ స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని జగన్ వాదనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్, వారిరువురి సమావేశ సందర్భంగా అంగీకరించారు. ఎన్ని పార్టీలు వ్యతిరేకించినా, 133 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ (117 ఎంపీలు) మద్దతు ఉంటే, తెలంగాణ విభజన తేలిగ్గా చేసేయవచ్చని తలపోస్తున్న కాంగ్రెస్సుకు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. ఇదిలా ఉండగా, ఏ కూటమిలో లేని 19 మంది ఎంపీల తృణమూల్ కాంగ్రెస్ దన్ను పొందటం, ‘జగన్ వెనకే మేము’ అని మమతాబెనర్జీ అంతటి ఫైర్ బ్రాండ్ చేతే అనిపించుకోవడం డిల్లీలో పెద్దలకి మింగుడు పడటం లేదు. యుపిఎ కూటమికి బైటనుచి సహకరిస్తున్న సమాజ్ వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ పార్టీ యువరాజు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ని జగన్ కలవడం అనూహ్యమైన పరిణామం కాకపోయినా, ఈ విషయంలో జగన్ వ్యూహం వేరని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఇటీవల బెంగుళూరులో జరిగిన కార్యక్రమానికి తన కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర నేతలతో కలిసి హాజరయిన సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ, తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించబోమని కరాఖండిగా చెప్పారు. అదే సందర్భంలో, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ధైర్యాన్ని అభినందిస్తున్నానని చెప్పారు. నిజానికి, కిరణ్ అధిస్ఠానం అడుగుజాడల్లోనే నడుస్తూ, విభజన ప్రక్రియ వేగవంతం కావడానికి చక్కని ఉత్ప్రేరకంగా, బహు విధేయంగా నడుచుకుంటున్న విషయం సమాజ్ వాదీ పార్టీ అధినాయకులకు తెలియదు. కిరణ్ ప్రకటనలు ఒట్టి కాగితపు పులి గాడ్రింపులేనని, వాటి వెనక కాంగ్రెస్ మంత్రాంగం ఉందనీ సమాజ్ వాదీ పార్టీ నేతలకి, ముఖ్యంగా అఖిలేష్ కు విడమరిచి చెప్పడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్నో పర్యటనలో మరో ముఖ్యోద్దేశ్యమని తెలుస్తోంది. జగన్ తన వ్యూహరచనలో, దాన్ని అమలు చేస్తున్న తీరులో కనబరుస్తున్న పరిణితికి రాజకీయ విశ్లేషకులు ముక్కన వేలేసుకుంటుంటే, తెలంగాణా బిల్లు ఇక తెల్లారినట్టేనని విభజనవాదులు భయపడుతున్నారు. -
ఆచార్యదేవోభవ
ఇంద్రియాల(భూదాన్‌పోచంపల్లి), న్యూస్‌లైన్: జాతీయ నాయకులు, రాజకీయ నాయకులకు విగ్రహాలు నెలకొల్పడం చూశాం. కానీ, భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో ఓ ఉపాధ్యాయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏటా అతని వర్ధంతి కార్యక్రమాలు, గురుపూజోత్సవం రోజున అతడిని స్మరించుకొంటారు. ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రానికి చెందిన కొప్పుల దామోదర్‌రెడ్డి ఇంద్రియాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా 1976 నుంచి 1983 వరకు పనిచేశారు. పాఠశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామస్తుల ద్వారా విరాళాలు సేకరించి శ్రమదానం చేసి 4 అదనపు తరగతి గదులు నిర్మించారు. 7వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయించారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో పాటు వర్షం వస్తే రోడ్డు దిగబడేది. దీంతో గ్రామానికి వచ్చే బస్సు రద్దయ్యింది. దామోదర్‌రెడ్డి గ్రామస్తులను కూడగట్టి శ్రమదానం చేసి రోడ్డుకు మట్టిపోసి మరమ్మతులు చేయించారు. రద్దు చేసిన బస్సును తిరిగి నడిపించాలని కోరుతూ 1983 ఆగస్టు 28న దిల్సుఖ్నగర్ డిపో మేనేజర్‌తో మాట్లాడి స్కూట ర్‌పై వస్తుండగా పోచంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. దామోదర్‌రెడ్డి విద్యాబోధనతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆ నేపథ్యం లోనే మరణించడంతో గ్రామస్తులు అతని విగ్రహాన్ని పాఠశాల ఆవరణలో ఉన్న గాంధీ, నెహ్రూ విగ్రహాల పక్కన ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అతను మరణించిన రోజున గ్రామంలో ర్యాలీ, పిల్లలకు వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 5న ప్రత్యేకంగా స్మరించుకొని నివాళులు అర్పిస్తారు. -
ఢిల్లీలో సీమాంధ్రవాణి వినిపించాం:మురళీకృష్ణ
న్యూఢిల్లీ: ఢిల్లీలో జాతీయ పార్టీల నేతలందరికీ సీమాంధ్ర వాణి వినిపించామని సీమాంధ్ర ఉద్యోగుల సెక్రటేరియట్ కన్వీనర్ మురళీకృష్ణ చెప్పారు. తమ ఢిల్లీ పర్యటన సంతృప్తికరంగా జరిగినట్లు తెలిపారు. జాతీయ నేతలకు సీమాంధ్రుల పరిస్థితులను వివరించినట్లు చెప్పారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సెప్టెంబర్ 7న హైదరాబాద్‌లో సభ నిర్వహించి తీరుతామన్నారు. సభలో అన్ని పార్టీల నేతలను పాల్గొనాలని కోరినట్లు తెలిపారు.