అశ్రునివాళి
కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు
- కన్నీళ్లుపెట్టిన పన్నీర్ సెల్వం, శశికళ ఓదార్చిన ప్రధాని మోదీ
- రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, 8 రాష్ట్రాల ముఖ్యమంత్రుల నివాళి
- అంత్యక్రియలకు హాజరైన జాతీయ నేతలు, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులు
సాక్షి, చెన్నై: పురచ్చితలైవీ జయలలితకు నివాళులర్పించేందుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు పెద్ద సంఖ్యలో మంగళవారం చెన్నైకు తరలివచ్చారు. ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి ‘అశ్రు’నివాళులర్పించారు. అమ్మ భౌతికకాయాన్ని రాజాజీ హాల్‌కు తీసుకువచ్చినప్పటి నుంచి పెద్ద సంఖ్యలో ప్రముఖులు, ప్రజలు సందర్శించారు. ప్రధాని మోదీ మధ్యాహ్నం 1.15 సమయంలో రాజాజీ హాల్‌కు చేరుకుని జయలలిత పార్థివ దేహం వద్ద నివాళులర్పించారు. మోదీ అక్కడికి రాగానే తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం కొంత ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన్ని మోదీ ఆలింగనం చేసుకుని ఓదార్చారు.
అలాగే జయలలిత నెచ్చెలి శశికళను మోదీ పరామర్శించారు. ఆమె తలపై ఆప్యాయంగా చేరుు వేసి ఓదార్చారు. అక్కడే ఉన్న జయలలిత అన్న జయకుమార్ కుమారుడు దీపక్‌ను పరామర్శించారు. తమిళనాడుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ప్రధాని హామీ ఇచ్చినట్టు కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాకు తెలిపారు. అనంతరం మూడున్నర గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్కడికి చేరుకుని జయలలిత పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ జయలలిత భౌతికకాయానికి నివాళులర్పించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, తమ పార్టీకి చెందిన ముఖ్యనేతలతో కలసి జయలలిత భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఆమె లేని లోటు అన్నాడీఎంకే వర్గాలకు తీర్చలేనిదని, పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామని స్టాలిన్ మీడియాతో పేర్కొన్నారు. జయకు నివాళులర్పించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేరళ సీఎం విజయన్, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, కేంద్ర మంత్రులు వెంకయ్య, నిర్మలా సీతారామన్, మాజీ గవర్నర్ రోశయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ వరప్రసాద్ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు హాజరయ్యారు. ఇక, దక్షిణభారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ సతీమణి ప్రేమలత, అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్యలతో కలసి జయలలిత పార్థివదేహం వద్ద నివాళులర్పించారు.
జయలలిత మరణవార్త విని తమిళనాడులో 36 మంది మృతి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణవార్త విని తమిళనాడులో 36 మంది మరణిం చారు. వీరిలో 31 మంది గుండె పోటు తో మరణించగా, ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవా రం రాత్రి నుంచి దిగాలుగా ఉన్న అరుం బు కోటైకి చెందిన సుబ్బురాజ్ (42) అనే అన్నాడీఎంకే కార్యకర్త మంగళ వారం ఉదయం విధులకు హాజరై అక్కడి తోటలోని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వేదార ణ్యంకు చెందిన కాలియప్పన్ (77) అనే అన్నాడీఎంకే సభ్యుడు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. కోయం బత్తూరు హరిజన కాలనీకి చెందిన వడివేలు అనే డ్రైవర్ ఇంటిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేలూరు సామివేల్ నగర్‌కు చెందిన పేరరసు, ఆరణికి చెందిన సురేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.