న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని మోదీ పార్టీ పదాదికారులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి మరిన్ని ఓట్లను ఒడిసిపట్టాలని పార్టీ సీనియర్ నేతలకు సూచించారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్టీ జాతీయ పథాధికారుల సమావేశం ఇందుకు వేదికైంది. రెండురోజులపాటు సాగిన ఈ సమావేశం శనివారం ముగిసింది.
నేషనల్ ఆఫీస్ బేరర్స్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లు, రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఇతర సంస్థాగత విభాగాల సారథులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో చర్చకొచి్చన ఇతరత్రా అంశాలను విశ్వసనీయ వర్గాలు శనివారం వెల్లడించాయి. ‘‘త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల సమరంలో సగానికిపైగా ఓట్లు బీజేపీకే దఖలుపడాల్సిందే.
పోలింగ్‌లో పార్టీ ఓటు షేర్ కనీసం 10 శాతమైనా పెరగాల్సిందే. 2019లో బీజేపీ 37శాతానికిపైగా ఓటు షేరు సాధించింది. ఎన్‌డీఏ కూటమి దాదాపు 45 శాతం ఓటుషేరు సాధించింది. 2014 నుంచి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు ఒక్క బీజేపీకే పడ్డాయి. దృఢ కార్యదీక్షతో ఎన్నికల క్షేత్రంలో అవిశ్రాంతంగా పనిచేయండి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 303 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే.
అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన చోట్ల మన పార్టీ విజయభేరీ మోగించాలి. ఆ బాధ్యత మీదే. జనం మెచి్చన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చొచ్చుకుపొండి. తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేసే విపక్ష పారీ్టల ఆటకట్టించండి. అందుకోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసిన ప్రాజెక్టులు, పనులు, వాస్తవ గణాంకాలతో ప్రజలకు నిజానిజాలకు తెలియజెప్పండి’’ అని బీజేపీ నేతలకు మోదీ సూచించారు.
నాలుగు ‘కులాలను’ కలుపుకొని పొండి
‘దేశంలో నాలుగే కులాలున్నాయి. మహిళలు, యువత, రైతులు, పేదలు. ప్రచారంలో భాగంగా ఈ నాలుగు కులాలను కలిసి వారి కష్టాలకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నంచండి. అద్భుత ఫలితాలు, ప్రజాదరణ పొందిన కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లండి’ అని మోదీ సూచించారు.
కేంద్రంలో బీజేపీ హయాంలో అమలవుతున్న కేంద్ర పథకాలు, వాటి లబ్ధిదారుల విజయగాథలను తెల్సుకుంటూ, ప్రజల్లో పథకాల అవగాహన పెంచుతూ ముందుకు సాగుతున్న ‘ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ను మరింతగా విజయవంతంగా చేయడంపైనా సమావేశంలో నేతలు చర్చించారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలు, త్వరలో జరగబోయే అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకలను మరింత బాగా నిర్వహించడం, తదితరాలూ సమావేశంలో చర్చకొచ్చాయి.
మూడు రాష్ట్రాల ఎన్నికల్లో నమోదైన విజయం.. సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో విజయానికి శుభసూచకమని నేతలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారని వార్తలొచ్చాయి. బూత్ కమిటీలను పటిష్టవంతంచేస్తేనే ఎక్కువ మంది ఓటర్లను మనం చేరుకోగలమని నేతలు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
‘‘మూడు రాష్ట్రాల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాం. ఇక సార్వత్రిక సమరంలోనూ హ్యాట్రిక్ కొట్టబోతున్నాం’’ అని నేతల ముందు మోదీ విశ్వాసం వ్యక్తంచేశారని తెలుస్తోంది. ‘‘మన ప్రదర్శన చూసి విపక్షాలు కంగుతినాలి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారట. రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ ఘన విజయంపై ఆ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు పార్టీని పొగుడుతూ ప్రసంగించారు. వచ్చే నెలలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారం¿ోత్సవం సార్వత్రిక ఎన్నికల్లో పారీ్టకి బాగా కలిసొస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment