సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ఈ సాయంత్రం ముగిసింది. గత నెల రోజులుగా అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించి.. ప్రజల్ని ఆకర్షించేందుకు ప్రయత్నించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సైతం ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ సహా అగ్రనేతలందరినీ ఎన్నికల ప్రచారబరిలో దింపింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, నలుగురు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 10మంది కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ 3 సభలు నిర్వహించగా, అమిత్‌షా 9 సభలు, రెండు రోడ్ షోలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ 8 సభలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్ 2 సభలు, నితిన్ గడ్కరీ 4 సభలు, స్మృతి ఇరానీ, సుష్మాస్వరాజ్, రమణసింగ్, దేవేంద్ర ఫడ్నవీస్, శివరాజ్ సింగ్ చౌహన్, ముక్తర్ అబ్బాస్, షాన వాజ్ హుస్సేన్, పురుషోత్తం రూపాలు ఒక రోజు పర్యటనలు చేశారు.
రాం మాధవ్, జుయల్ ఓరం, పురందేశ్వరి, జేపీ నడ్డా, హన్సరాజ్ గంగారాంలు పలు సార్లు పర్యటించారు. బీజేపీ ప్రతి నియోజగవర్గంలో రెండు సభలు నిర్వహించింది. మొత్తం జాతీయ నాయకులు దాదాపుగా 90 సభలు నిర్వహించారు. స్వామీ పరిపూర్ణానంద దాదాపుగా 90 సభలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment