విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఏపీ పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి ఎం ఎం పళ్లంరాజు, నగర పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, పీసీసీ అధికార ప్రతినిధి శివాజీతోపాటు రాజేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బంద్ నేపథ్యంలో ఆంధ్రరత్న భవన్‌నుంచి ర్యాలీగా కాంగ్రెస్ నాయకులు బయలుదేరారు. ఆ క్రమంలో బంద్‌లో పాల్గొనాలని ప్రజలను వారు కోరారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.