కొచ్చి: తన నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ హైదరాబాద్ క్రీడాకారిణి గద్దె రుత్విక శివాని... ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక 21-7, 21-14తో రేష్మా కార్తీక్ (ఎయిరిండియా)పై గెలుపొందింది. మంగళవారం జరిగే ఫైనల్లో హైదరాబాద్‌కే చెందిన రితూపర్ణ దాస్‌తో రుత్విక తలపడుతుంది.
మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ రితూపర్ణ 21-14, 19-21, 21-16తో తన్వీ లాడ్ (ఎయిరిండియా)పై విజయం సాధించింది. హైదరాబాద్‌కే చెందిన మరో అమ్మాయి శ్రీకృష్ణప్రియ పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. శ్రీకృష్ణప్రియ 17-21, 21-16, 14-21తో రేష్మా కార్తీక్ చేతిలో పోరాడి ఓడింది. మహిళల డబుల్స్ విభాగంలో మేఘన-మనీషా (ఆంధ్రప్రదేశ్) జోడి ఫైనల్‌కు చేరింది.
ఫైనల్లో రుత్విక శివాని
Published Tue, Dec 30 2014 1:55 AM | Last Updated on Fri, Sep 7 2018 4:39 PM
Advertisement
Advertisement