ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్ | Badminton players siril Varma, Rahul Yadav enter into pre quarter final | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్

Published Tue, Dec 3 2013 1:54 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్ - Sakshi

ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్

సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్లు సిరిల్ వర్మ, రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన బాలుర సింగిల్స్ అండర్-17 మూడో రౌండ్‌లో రెండో సీడ్ రాహుల్ 21-8, 21-16తో హర్ష్ జగ్ధనే (మహారాష్ట్ర)పై, ఐదో సీడ్ సిరిల్ 15-21, 21-10, 21-15తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (చండీగఢ్)పై గెలుపొందారు. ఆరో సీడ్ కనిష్క్ 21-12, 21-11తో ధర్మశేఖరన్ (తమిళనాడు)ను కంగుతినిపించగా, చంద్రకుమార్ 21-15, 15-21, 21-10తో 11వ సీడ్ బొధిత్ జోషి (ఉత్తరాఖండ్)కి షాకిచ్చాడు. బాలికల విభాగంలో పదో సీడ్ వృశాలి, రుత్విక శివాని ప్రిక్వార్టర్స్‌కు అర్హత పొందారు. వృశాలి 21-6, 21-5తో నికిత సింగ్ (జార్ఖండ్)పై, రెండో సీడ్ రుత్విక 21-1, 21-5తో జాస్మిన్ సాహు (ఒరిస్సా)పై విజయం సాధించారు.

 ఇతర ఫలితాలు
 అండర్-19 బాలుర సింగిల్స్: కనిష్క్ 13-21, 21-18, 14-21తో హర్షిల్ డాని (ఎయిరిండియా) చేతిలో, ఉపేంద్ర 17-21, 14-21తో అన్సల్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడారు. బాలికలు: రుత్విక శివాని  21-6, 21-8తో హర్షిత చాలిహ (అస్సాం)పై, శ్రీకృష్ణప్రియా 21-8, 21-9 స్నేహన్ క్రిస్టియన్ (గుజరాత్)పై గెలువగా, వృశాలి 15-21, 17-21తో శ్రీయాన్షి పరదేశి (ఎయిరిండియా) చేతిలో ఓడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement