Badminton players
-
‘నన్ను పెళ్లాడతావా’.. స్వర్ణంతో పాటు ఎంగేజ్మెంట్ రింగ్ కూడా (ఫొటోలు)
-
బ్యాడ్మింటన్ క్రీడలో తప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌లు.. వయసు మార్చి గోల్మాల్!
-శ్రీరంగం కామేష్, సాక్షి ప్రతినిధి బ్యాడ్మింటన్‌లో ఓ వయస్సు క్రీడాకారుడు అదే ఏజ్ గ్రూప్‌లో ఉండే మరో ఆటగాడితో పోటీ పడాలి. నిబంధనలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అలా జరిగినప్పుడే సరైన పోటీ అన్పించుకుంటుంది. వయస్సులో తేడాలున్నప్పుడు ఆటలోని అనుభవాన్ని బట్టి ప్రతిభా సామర్థ్యాల్లో సైతం తేడా ఉండేందుకు అవకాశం ఉంటుంది. పతకాలు, ర్యాంకుల్ని సైతం ప్రభావితం చేస్తుంది. ఇంతటి కీలకమైన వయస్సు నిబంధనకు తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకర్లు తూట్లు పొడిచారు. తమ పుట్టిన తేదీ విషయంలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. తమ వాస్తవ వయస్సును తగ్గించేసి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు (బీఏఐ) తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ మేరకు అందిన ఆకాశరామన్న ఉత్తరం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సెంట్రల్ క్రైౖమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ముగ్గురి విషయంలో ఈ అక్రమాలను నిర్ధారించారు. సమగ్ర ఆధారాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు లేఖ రాశారు. కానీ వారు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఉత్తరం ఆధారంగా.. ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సిటీ సీసీఎస్ పోలీసులకు ఓ అజ్ఞాత వ్యక్తి లేఖ ద్వారా అందజేశారు. ఈ ఏడాది మార్చి 29న అందిన ఈ లేఖలో ఆరుగురు క్రీడాకారులపై ఆరోపణలున్నాయి. వీరు తమ అసలు వయస్సును దాచి పెట్టి నకిలీ సర్టిఫికెట్ల సృష్టించి బీఏఐకి సమర్పించారని, తద్వారా తమ కంటే చిన్న వారితో పోటీల్లో తలపడుతూ మెడల్స్, జాతీయ స్థాయి ర్యాంకులు సాధిస్తున్నారని అతను ఆరోపించారు. దీనివల్ల నిబంధనలు పాటించిన క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే బీఏఐకి అనేకమంది నుంచి ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవట్లేదని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేసిన సీసీఎస్.. కేవలం ఈ ఆరుగురే కాకుండా దాదాపు 40 మంది బ్యాడ్మింటన్ ఆటగాళ్ల వయస్సు విషయంలో తమకు సందేహాలు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి ఆ లేఖలో పేర్కొన్నారు. వీరిలో చాలామంది 2005–10 మధ్య పుట్టారని, అయితే జనన ధ్రువీకరణ పత్రాలకు బదులుగా కొందరు వైద్యులు ఇచ్చిన బోగస్ మెడికల్ సర్టిఫికెట్లు దాఖలు చేసి తమ వయస్సు తగ్గించుకున్నారని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రీడాకారులకు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది కోచ్‌లు, వారి తల్లిదండ్రులతో పాటు ఈ వైద్యుల సహకారం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ లేఖను సిటీ పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె.చంద్రకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: BWF Rankings: తొమ్మిదో ర్యాంక్‌కు ప్రణయ్.. పీవీ సింధు మాత్రం.. ముగ్గురి విషయంలో ఆధారాలు లభ్యం... సీసీఎస్ ప్రత్యేక బృందానికి తొలి దశలోనే ముగ్గురు క్రీడాకారులకు సంబంధించిన సమగ్ర ఆధారాలు లభించాయి. బీఏఐ జాబితాలో అండర్–17 కేటగిరీలో 1176 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్న రోహన్‌కుమార్ ఆనంద్‌దాస్ రాజ్‌కుమార్ తాను పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొంటూ బీఏఐకి సర్టిఫికెట్లు సమర్పించి టోర్నమెంట్లలో ఆడాడు. వాస్తవానికి రోహన్ పుట్టిన తేదీ 2005 అక్టోబర్ 29గా పోలీసులు నిర్ధారించారు. ఇదే కేటగిరీలో 92 పాయింట్లతో 44వ ర్యాంక్‌లో ఉన్న దవు వెంకట శివ నాగరామ్ మౌనీష్ తన పుట్టిన తేదీని 2007 జనవరి 29గా పేర్కొన్నారు. అయితే ఇతని అసలు పుట్టిన తేదీ 2006 జూన్4 అని దర్యాప్తులో తేలింది. అండర్–15 కేటగిరీలో 188 పాయింట్లతో 32వ ర్యాంక్‌లో ఉన్న భూక్యా నిషాంత్ తన పుట్టిన రోజును 2010 అక్టోబర్ 12గా పేర్కొనగా.. ఇతడి వాస్తవ పుట్టిన తేదీ 2007 జనవరి 12గా తేలింది. అయితే వీళ్లంతా మైనర్లు కావడంతో తమంతట తాముగా ఇలాంటి చర్యలకు పాల్పడలేరని, వాళ్ల కోచ్‌లు లేదా తల్లిదండ్రుల సహకారం, ప్రోద్బలంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. వారినే ఈ వ్యవహారంలో బాధ్యుల్ని చేయాలని భావిస్తున్నారు. ఏమాత్రం స్పందించని అసోసియేషన్.. ముగ్గురి బాగోతం బట్టబయలు కావడంతో ఇలాంటి వాళ్లు మరికొందరు ఉండి ఉంటారని పోలీసులు అనుమానించారు. అయితే ఈ వ్యవహారాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలన్నా, బాధ్యుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఫిర్యాదు తప్పనిసరి. ఈ నేపథ్యంలో అన్ని వివరాలతో తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్‌కు ఈ ఏడాది మే 25న ఓ లేఖ (నం.65/పీఈ/క్యాంప్/డీసీపీ/డీడీ/సీసీఎస్/డీడీ/2023) రాశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుని తమకు తెలియజేయాల్సిందిగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ డీసీపీ కోరారు. కానీ అసోసియేషన్ ఇప్పటివరకు స్పందించక పోవడంతో వారికి తెలిసే ఈ స్కామ్ జరుగుతోందా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కామ్ దేశ వ్యాప్తంగా జరుగుతూ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. చదవండి: ఔటర్ చుట్టూ ఏడు ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లు -
తన ముఖం కూడా చూడను! నాడు భోరున ఏడ్చేసిన సైనా! రూ. 2500 కూడా..
Saina Nehwal Successful Journey- Interesting Facts In Telugu: ‘మళ్లీ అమ్మాయేనా.. నేను దాని మొహం కూడా చూడను పో’.. ఆ వృద్ధురాలు చేసిన కటువైన వ్యాఖ్యకు ఉన్నత విద్యావంతుడైన ఆమె కుమారుడు కనీసం జవాబు కూడా ఇవ్వలేకపోయాడు. ఆ ఇంట్లో ఏడేళ్ల క్రితం అమ్మాయి పుట్టింది. ఇప్పుడు మనవడు కావాలని నానమ్మ ఆశించింది. అయితే అది జరగలేదు. పురుషులు, మహిళల నిష్పత్తిలో దేశంలోనే ఎక్కువ అంతరం ఉండే, ఆడపిల్లల పట్ల తీవ్ర వివక్ష చూపించే రాష్ట్రం హర్యానాలో.. అదీ అమ్మాయిలు పుట్టగానే నొసలు చిట్లించడమనేది ఎక్కువ మందికి అలవాటుగా ఉన్న హిస్సార్‌లో ఆమె ప్రవర్తన కొత్తగా అనిపించలేదు. చివరకు నెలరోజుల తర్వాత కొడుకు బతిమాలితే గానీ తన మనవరాలిని ఆమె చూడలేదు. కానీ అందులో ప్రేమ లేదు! ఆ సమయంలో తల్లికి ఏమీ చెప్పలేకపోయిన ఆ పాప తండ్రి మనసులో గట్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన రెండో కూతురును మాత్రం అందరికంటే ప్రత్యేకంగా పెంచాలని, ఆమెను చూసి మున్ముందు అందరూ గర్వపడాలని భావించాడు. అందుకు ఆయన ఎంచుకున్న మార్గం క్రీడలు! ఆ హిస్సార్ బిడ్డ తర్వాతి రోజుల్లో హైదరాబాదీగా మారి ప్రపంచ బ్యాడ్మింటన్‌పై తనదైన ముద్ర వేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఆమే సైనా నెహ్వాల్... భారత మహిళల బ్యాడ్మింటన్‌కు టార్చ్‌బేరర్‌లా నిలిచిన స్టార్ షట్లర్. అమ్మా నాన్న అండతో.. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరడంతోనే సైనా ఆటకు పునాది పడింది. సరదాగా కరాటే నేర్చుకున్నా.. స్విమ్మింగ్, సైక్లింగ్ ఎన్ని చేసినా అవి ఆమెను ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మార్చలేవని తండ్రికి అనిపించింది. పైగా కరాటే నేర్చుకుంటున్న సమయంలో ఒక మోటార్ బైక్‌ను కొందరు విద్యార్థుల చేతుల మీదుగా తీసుకుపోవాలని ఇన్స్ట్రక్టర్ సూచించాడు. అది తన వల్ల కాదంటూ కరాటేను వదిలేసేందుకే సైనా సిద్ధమైంది. దాంతో కెరీర్లో ఎదిగే ఆటను ఆయన గుర్తించాడు. ఎనిమిదేళ్ల వయసులో సైనా చేతికి బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చాడు. షటిల్ ఆటపై ఆయనకు ఉన్న ప్రత్యేక ఆసక్తి కూడా అందుకు కారణం కావచ్చు. సైనా తల్లి ఉషారాణికి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో ఆడిన అనుభవమూ ఉండటంతో ఇంట్లోనే అదనపు ప్రోత్సాహం కూడా లభించింది. దాంతో ఆట మొదలైంది. ఫలితాల గురించి ఆలోచించే పరిస్థితి ఎనిమిదేళ్ల పాపకు రాకూడదని భావించిన హర్వీర్ ఏ దశలోనూ విజయాలు, పరాజయాల గురించి ఆ చిన్నారితో మాట్లాడలేదు. నువ్వు ఆడుతూ ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అనే భరోసాను మాత్రం కల్పించాడు. ‘ఒక ప్లేయర్ పెద్ద స్థాయికి చేరాలంటే ఆ ప్లేయర్ ఎంత బాగా ఆడతాడనేది కాదు. ప్లేయర్‌తో పాటు కూడా తల్లిదండ్రులు ఎంత సమయం వెచ్చిస్తారనేది ముఖ్యం. మీరు మీ పిల్లల కోసం ఎంత సమయం ఇవ్వగలరు’.. ఏదైనా ఆటలో శిక్షణ కోసం అకాడమీకి వెళితే కోచ్‌ల నుంచి సాధారణంగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే ఇది. హర్వీర్కూ ఇదే ఎదురైంది. నేను ఎంత సమయమైనా ఇస్తానని ఆయన చెప్పాడు. రాజేంద్రనగర్‌లోని తన ఇంటి నుంచి ఎల్బీ స్టేడియం వరకు కోచింగ్‌కు వస్తూ, పోతూ సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణంలో చేతక్ స్కూటర్‌పైనే నిద్ర కూడా! ఇదే తరహాలో ఆమె శిక్షణ సాగింది. సైనా ప్లేయర్‌గా ఎదుగుతున్న సమయంలో తన ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినా, హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి రావడంతో తండ్రి వాటిని వదులుకున్నాడు. కూతురు కోసం దేనికైనా సిద్ధపడిన ఆయన ఆశలను సైనా వమ్ము చేయలేదు. ఎవరి వల్లా కాలేదు కోట్లాది రూపాయల ఆదాయం, ఇళ్లు, కార్లు, విలాసవంతమైన జీవితం.. సాధారణంగా పెద్ద స్థాయిలో ఉన్న ఆటగాళ్ల గురించి అందరిలో ఉండే భావనే ఇది. కానీ ఆ స్థాయికి చేరేందుకు వారు పడిన కష్టం, శ్రమ మాత్రం బయటకు కనిపించదు. సైనా నేపథ్యం పేదదేమీ కాకపోవచ్చు. అయినా సరే ఒక ప్లేయర్‌గా మారే కోణంలో చూస్తే ఆర్థికపరమైన అడ్డంకులు తలుపు తడుతూనే ఉంటాయి. రాకెట్ కొనుగోలు మొదలు టూర్లు, ఎక్కడో జరిగే టోర్నీలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు చూస్తే పరిధి దాటుతూనే ఉంటాయి. సైనాకు 9 ఏళ్ల వయసులో ఓ అండర్ 10 టోర్నీలో ఆడేందుకు మొదటిసారి ఖరీదైన రాకెట్‌ను (1999లో రూ. 2,700) కొనిచ్చాడు తండ్రి. అయితే చెన్నైలో జరిగిన ఈ టోర్నీ సందర్భంగా దానిని ఆమె పోగొట్టుకుంది. ఆ సమయంలో భోరున ఏడ్చేసిన సైనాను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. అందుకే స్పోర్ట్ అథారిటీ ఇచ్చిన రూ. 700 స్కాలర్షిప్, కొన్నాళ్ల తర్వాత పెట్రోలియం బోర్డు అందించిన రూ. 2,500 స్కాలర్షిప్ కూడా ఆమెకు బంగారంలా అనిపించాయి. తన భార్య ఆరోగ్యం బాగా లేదంటూ హర్వీర్ ఆరు సార్లు పీఎఫ్ ఖాతానుంచి సైనా ఆట కోసమే డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది. అయితే ఆ కష్టం ఎప్పుడూ వృథా కాలేదు. నడిచొచ్చిన విజయాలు సైనా విజయప్రస్థానంలో ఎప్పుడూ పెద్దగా ఆటుపోట్లు ఎదురు కాలేదు. అద్భుతమైన ఆట, కఠోర శ్రమ, తొందరగా నేర్చుకునే తత్వం, తప్పులను వెంటనే సరిదిద్దుకునే అలవాటు సైనాను శిఖరానికి తీసుకెళ్లాయి. జూనియర్ స్థాయిలో సైనా పదునైన ఆట గురించి ఎన్ని విశేషణాలతో ప్రశంసించినా తక్కువే. ప్రత్యర్థులకు అందనంత రీతిలో, తిరుగులేని ప్రదర్శనతో ఆమె దూసుకుపోయింది. 15 ఏళ్ల వయసులో సీనియర్ స్థాయిలో న్యూఢిల్లీలో తొలి టైటిల్ (ఆసియా శాటిలైట్) గెలిచిన తర్వాత సైనా ఎక్కడా ఆగలేదు. తర్వాతి ఏడాది ప్రతిష్ఠాత్మక 4 స్టార్ ఫిలిప్పీన్స్ ఓపెన్ గెలిచిన తర్వాత సైనా సత్తా ఏమిటో బ్యాడ్మింటన్ ప్రపంచానికి తెలిసింది. 2008లో వరల్డ్ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత ప్రతిష్ఠాత్మక విజయాలు సైనా ఖాతాలో వచ్చి చేరాయి. చాలెంజర్ టోర్నీలు, గ్రాండ్ ప్రి, గ్రాండ్ ప్రి గోల్డ్, సూపర్ సిరీస్, సూపర్ సిరీస్ ప్రీమియర్... ఇలా పేరు ఏదైతేనేం విజేత సైనా మాత్రమే. తన అంతర్జాతీయ కెరీర్లో అత్యుత్తమ స్థాయిలో 24 అంతర్జాతీయ టైటిల్స్ సైనా గెలుచుకుంది. ఇందులో 10 సూపర్ సిరీస్‌లే ఉన్నాయి. ఇండోనేసియా, సింగపూర్, హాంకాంగ్, డెన్మార్క్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, చైనా ఓపెన్, ఇండియన్ ఓపెన్.. వేదికలు మారడమే తప్ప విజయాలు మాత్రం తనవే. కొన్ని ఘనతలు... ►ఒలింపిక్ కాంస్య పతకం ►వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక రజతం, ఒక కాంస్యం ►కామన్వెల్త్ క్రీడల్లో రెండు స్వర్ణాలు ►ఆసియా క్రీడల్లో కాంస్యం ►ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో రజతం ► సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రజతం భారత ప్రభుత్వం పౌర పురస్కారాలు ► పద్మశ్రీ, పద్మభూషణ్‌లతో పాటు క్రీడా పురస్కారాలు అర్జున, ఖేల్‌రత్నలతో సైనా నెహ్వాల్‌ను గౌరవించింది. ఆ పతకం ఒక మణిహారం.. 2012 ఆగస్టు 4.. సైనా నెహ్వాల్ ఉజ్వల కెరీర్‌ను శిఖర స్థాయిలో నిలిపిన విజయం. లండన్ ఒలింపిక్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. తద్వారా బ్యాడ్మింటన్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది. వ్యక్తిగతం.. 2018లో.. సహచర బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌ను సైనా వివాహమాడింది. ఆమె కెరీర్ విశేషాలతో ‘సైనా’ అనే బయోపిక్ కూడా వచ్చింది. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైనా పాత్రలో పరిణీతి చోప్రా నటించింది. -మొహమ్మద్ అబ్దుల్ హాది చదవండి: KL Rahul: అతడిని ఎందుకు తప్పించారో తెలీదు! పంత్ దరిద్రం నీకు పట్టుకున్నట్టుంది! బాగా ఆడినా.. ఇదేం పోయే కాలమో! Cristiano Ronaldo: మ్యాచ్ ఓడిపోయి బాధలో ఉంటే బికినీలో అందాల ప్రదర్శన? -
సైనా నెహ్వాల్ ప్రేమ వివాహం..?
సాక్షి, హైదరాబాద్: సినిమా నేపథ్యం గల స్టార్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధారణమైన తరుణంలో క్రీడా నేపథ్యం ఉన్న ఆటగాళ్లు కూడా ఈ జాబితాలోకి చేరుతున్నారు. గతంలో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న దినేశ్- కార్తీక్- దీపికా పల్లికల్, గీతా ఫోగట్- పవన్ కుమార్, సాక్షి మాలిక్-సత్యవ్రత్ కాదియాన్, ఇశాంత్ శర్మ- ప్రతిమా సింగ్‌ల జాబితాలోకి బ్యాడ్మింటన్ స్టార్ జోడి చేరబోతోంది. బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాళ్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు త్వరలో ఒక్కటి కాబొతున్నారా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు వారి సన్నిహిత వర్గాలు. దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న సైనా-కశ్యప్‌ల వివాహానికి పెద్దలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. డిసెంబర్ 16న వివాహం, అదే నెల 21న రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మాత్రమే హాజరవుతారని, కానీ హైదరాబాద్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు సైనా-కశ్యప్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వీరిద్దరూ 2005 నుంచి గోపిచంద్ అకాడమీలో బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా వీరి ప్రేమ గురించి మీడియా ప్రస్తావించినప్పుడు స్పందించలేదు అదే విధంగా ఖండించనూలేదు. ఇద్దరు బ్యాడ్మింటన్ క్రీడాకారులు కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కువగా వార్తల్లో నిలువలేదు. తాజాగా ఈ స్టార్ ఆటగాళ్లు వివాహం చేసుకోబుతున్నారని తెలియగానే అభిమానులు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్ల కశ్యప్ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 28ఏళ్ల సైనా నెహ్వాల్ 2010,2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు, 2012 ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. చదవండి: ఆట మొదలు -
ముంబై మెరిసె...
* తొలి మ్యాచ్‌లో అవధ్ వారియర్స్‌పై గెలుపు * సింగిల్స్‌లో గురుసాయిదత్, రుత్విక విజయం * గాయంతో బరిలోకి దిగని సైనా నెహ్వాల్ * ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ ముంబై: సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే ముంబై రాకెట్స్ మెరిసింది. స్టార్ ఆటగాళ్లతో కూడిన అవధ్ వారియర్స్‌పై అద్భుత విజయం సాధించింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో శుభారంభం చేసింది. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో ముంబై రాకెట్స్ జట్టు 2-1 పాయింట్ల తేడాతో అవధ్ వారియర్స్‌ను ఓడించింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గిన ముంబై రాకెట్స్ విజయాన్ని ఖరారు చేసుకోగా... నామమాత్రమైన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో వారియర్స్ నెగ్గినా ఫలితం లేకపోయింది. కొత్త నిబంధన ‘ట్రంప్ మ్యాచ్’ రెండు జట్లకు కలసి రాలేదు. అవధ్ వారియర్స్ తొలుత పురుషుల డబుల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా ఎంచుకొని ఓడిపోగా... ముంబై రాకెట్స్ రెండో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌ను ‘ట్రంప్ మ్యాచ్’గా పేర్కొని ఓటమి పాలైంది. ఆదివారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు టాప్‌గన్స్‌తో హైదరాబాద్ హంటర్స్; ముంబై రాకెట్స్‌తో చెన్నై స్మాషర్స్ తలపడతాయి. ఇద్దరు తెలుగు తేజాల మధ్య జరిగిన పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్‌లో ప్రపంచ 47వ ర్యాంకర్ గురుసాయిదత్ (ముంబై) 14-15, 15-10, 15-8తో ప్రపంచ 34వ ర్యాంకర్ సాయిప్రణీత్ (అవధ్ వారియర్స్)ను ఓడించాడు. పురుషుల డబుల్స్ పోటీలో మథియాస్ బో-వ్లాదిమిర్ ఇవనోవ్ (ముంబై రాకెట్స్) ద్వయం 15-11, 15-11తో కాయ్ యున్-హెంద్రా గుణవాన్ (అవధ్ వారియర్స్) జంటపై గెలిచింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని (ముంబై) 15-13, 15-10తో మరో తెలుగు అమ్మాయి గుమ్మడి వృశాలి(వారియర్స్)ని ఓడించడంతో ముంబై విజయం ఖరారైంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో వృశాలి బదులుగా సైనా నెహ్వాల్ ఆడాలి. అయితే గాయం కారణంగా సైనా తొలి లీగ్ మ్యాచ్‌కు దూరం కావడంతో ఆమె స్థానంలో వృశాలి బరిలోకి దిగింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ 33వ ర్యాంకర్ తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (అవధ్ వారియర్స్) 15-12, 14-15, 15-14తో ప్రపంచ 20వ ర్యాంకర్ హెచ్ఎస్ ప్రణయ్ (ముంబై రాకెట్స్)పై సంచలన విజయం సాధించడంతో అవధ్ వారియర్స్ ఖాతాలో తొలి విజయం చేరింది. చివరిదైన మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్‌లో బోదిన్ ఇసారా-క్రిస్టినా (వారియర్స్) జంట 15-9, 14-15, 15-14తో కామిల్లా జుల్-ఇవనోవ్ (ముంబై) జోడీని ఓడించింది. వైభవంగా ఆరంభం కొత్త రూపుతో.. సరికొత్త ఆటతీరుతో అభిమానులను అలరించాలని చూస్తున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) శనివారం వైభవంగా ఆరంభమైంది. తారల నృత్యాలతో పాటు బాలీవుడ్ మధుర గీతాలతో ప్రారంభోత్సవ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రపంచ టాప్ స్టార్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా శ్రీలంక బ్యూటీ, హిందీ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పలు హిట్ గీతాలకు స్టెప్పులేసి హుషారు తెచ్చింది. అనంతరం సంగీత ద్వయం సలీం, సులేమాన్ చక్‌దే ఇండియా, బాండ్ బాజా బరాత్ తదితర సినిమాల్లోని పాటలను మరోసారి ప్రేక్షకులకు వినిపించారు. వీరే స్వరపర్చిన పీబీఎల్ అధికారిక గీతం ‘హల్లా మచాదే’ను కూడా ఆలపించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. అయితే ఈ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ తొలి రోజు హాజరుకాలేదు. రెండో రోజు ఆదివారం రానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ‘పీబీఎల్‌కు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఫ్రాం చైజీలకు, యజమానులకు, మద్దతుదారులకు ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరం కలిసి లీగ్‌ను సక్సెస్ చేయాలి’ అని పీబీఎల్ చైర్మన్ అఖిలేశ్ దాస్‌గుప్తా కోరారు. -
బ్యాడ్మింటన్ క్రీడాకారులకు సన్మానం
రాజమండ్రి(స్పోర్ట్స్): రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు రాజమండ్రి ఆఫీసర్స్ క్లబ్లో సన్మానం జరిగింది. రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక అయిన వివిధ కేటగిరీ విద్యార్థులకు ఎమ్మెల్యే ఆకుల సత్యానారాయణ అభినందనలు తెలిపారు. అనంతరం క్రీడాకారులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇప్పటికైనా ‘టాప్’లో చేర్చండి!
ప్రభుత్వ మద్దతు కోరుతున్న గుత్తా జ్వాల తమ ప్రదర్శనను గుర్తించాలంటున్న షట్లర్ సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే లక్ష్యంతో ఆటగాళ్లకు ఆర్థిక సహకారం అందిస్తూ ఇటీవల భారత ప్రభుత్వం టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పేరుతో భారీ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో బ్యాడ్మింటన్ ప్లేయర్లు ఆరుగురికి అవకాశం కల్పించగా... డబుల్స్ స్పెషలిస్ట్‌లు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్పలకు స్థానం లభించలేదు. అయితే తాజాగా కెనడా గ్రాండ్‌ప్రి టోర్నీ నెగ్గిన అనంతరం గుత్తా జ్వాల ఇప్పటికైనా తమను గుర్తించాలని, ప్రభుత్వ సహకారం ఉంటే తామూ ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తామని చెప్పింది. విజయానంతరం స్వస్థలం తిరిగొచ్చిన జ్వాల, బుధవారం మీడియాతో మాట్లాడింది. ‘సింగిల్స్ ఆటగాళ్లలాగే మాకూ ప్రభుత్వం సహకారం అందించాలి. అది దక్కితే నేను, అశ్విని కచ్చితంగా ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తాం. సంబంధిత వ్యక్తులు ఇప్పటికైనా మేల్కొనాలి. వారు మా గురించీ ఆలోచిస్తారని ఆశిస్తున్నా. డబుల్స్‌లో భారత్ తరఫున మాది అత్యుత్తమ జోడి. కాబట్టి అన్ని రకాల మద్దతు అవసరం. రెండు, మూడు రోజులు ఢిల్లీలో ఉండి పైరవీలు చేసుకోకుండా ఆటపై దృష్టి పెడుతున్నాం కాబట్టి మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదేమో. కెనడా ఓపెన్ తర్వాతైనా కేంద్ర క్రీడా శాఖ ఆలోచన మారాలి’అని జ్వాల ఘాటుగా వ్యాఖ్యానించింది. మా జోడీ సూపర్ : చాలా కాలం తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలవడం పట్ల గుత్తా జ్వాల సంతోషం వ్యక్తం చేసింది. ఒలింపిక్స్ సన్నాహక సంవత్సరంలో ఇది రావడం తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని, అశ్వినితో సమన్వయం బాగా కుదిరిందని చెప్పింది. ‘గత కొన్నేళ్లుగా మేం కలిసి ఆడుతున్నా... ఇటీవల కోర్టులో మా మధ్య సమన్వయం పెరగడం పట్ల ఇద్దరం సంతృప్తిగా ఉన్నాం. ఆటగాళ్లుగా ఇద్దరం ఎంతో పరిణతి సాధించాం. అనుభవం వల్లే కెనడా ఓపెన్‌లో విజయం దక్కింది. భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధిస్తాం. అయితే అంతిమ లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే’ అని జ్వాల వెల్లడించింది. టైటిల్ నెగ్గిన తర్వాత దేశ ప్రధాని మోది అభినందనలు అందుకోవడం గర్వంగా అనిపించిందని, ఇది తమ శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు జ్వాల పేర్కొంది. -
ఆగస్టులో బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్
- సందడి చేయనున్న - క్రీడాకారులు, సినీతారలు - చెన్నై నెహ్రూ స్టేడియం వేదిక - యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం కొరుక్కుపేట, న్యూస్‌లైన్: బ్యాడ్మింటన్ క్రీడాకారులు, సినీ తారలు కలిసి సందడి చేసేందుకు నగరంలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో ఇండియన్ బ్యాడ్మింటన్ సెలబ్రిటీ లీగ్ (ఐబీసీఎల్)ను నిర్వహించనున్నారు. దీనికి చెన్నై, నెహ్రూ స్టేడియం వేదికకానుంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఐబీసీఎల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్, ఐఈసీఎల్ బ్రాండ్ అంబాసిడర్ పి.వి. సింధూ, ప్రముఖ సినీ డెరైక్టర్ వెంకట్ ప్రభు హాజరై లోగోను ఆవిష్కరించారు. ఐబీసీఎల్ డెరైక్టర్, సీఈఓ హేమచంద్రన్ మాట్లాడుతూ తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3230, టై చెన్నైలతో కలిసి యువ క్రీడాకారులను ప్రోత్సహించేలా ఇండియన్ బ్యాడ్మింటన్ సెలెబ్రిటీ లీగ్ నిర్వహిస్తున్నామన్నారు. సినీ తారలు, టెక్నీషియన్లు, గాయనీగాయకులతో కలసి బ్యాడ్మిం టన్ క్రీడాకారులు లీగ్‌లో ఆడనున్నారని తెలిపారు. ఇందులో పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ అంటూ మూడు కేటగిరిలలో జరుగనున్నాయి. ఇందులో సినీ తారలు అజిత్, జననీ అయ్యర్, వెంకట్ ప్రభు, ఆది, నితిన్ సత్య, నమిత తదితర తారలు, టెక్నిషియన్లు, గాయకులు పాల్గొననున్నారన్నారు. అనంతరం ఐబీసీఎల్ చైర్మ న్ మౌళి మదన్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన యువ క్రీడాకారుల ప్రతిభ ను గుర్తించి ప్రోత్సహించేలా ఐబీసీఎల్ వేదిక కానుందన్నారు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. పి.వి సింధూ మాట్లాడుతూ సెలబ్రిటీలతో క్రీడాకారులు కల సి బ్యాడ్మింటన్ క్రీడను ఏర్పాటు చేయ డం సంతోషంగా ఉందన్నారు. యువ క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వచ్చేందుకు ఇదో మంచి అవకాశం అని, ఐబీసీఎల్ సక్సెస్ సాధించాలని కోరారు. తమిళనాడు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కోచ్ మారన్, సెక్రటరీ అశోక్ బాలాజీ పాల్గొన్నారు. -
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్లు సిరిల్ వర్మ, రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన బాలుర సింగిల్స్ అండర్-17 మూడో రౌండ్లో రెండో సీడ్ రాహుల్ 21-8, 21-16తో హర్ష్ జగ్ధనే (మహారాష్ట్ర)పై, ఐదో సీడ్ సిరిల్ 15-21, 21-10, 21-15తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (చండీగఢ్)పై గెలుపొందారు. ఆరో సీడ్ కనిష్క్ 21-12, 21-11తో ధర్మశేఖరన్ (తమిళనాడు)ను కంగుతినిపించగా, చంద్రకుమార్ 21-15, 15-21, 21-10తో 11వ సీడ్ బొధిత్ జోషి (ఉత్తరాఖండ్)కి షాకిచ్చాడు. బాలికల విభాగంలో పదో సీడ్ వృశాలి, రుత్విక శివాని ప్రిక్వార్టర్స్‌కు అర్హత పొందారు. వృశాలి 21-6, 21-5తో నికిత సింగ్ (జార్ఖండ్)పై, రెండో సీడ్ రుత్విక 21-1, 21-5తో జాస్మిన్ సాహు (ఒరిస్సా)పై విజయం సాధించారు. ఇతర ఫలితాలు అండర్-19 బాలుర సింగిల్స్: కనిష్క్ 13-21, 21-18, 14-21తో హర్షిల్ డాని (ఎయిరిండియా) చేతిలో, ఉపేంద్ర 17-21, 14-21తో అన్సల్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడారు. బాలికలు: రుత్విక శివాని 21-6, 21-8తో హర్షిత చాలిహ (అస్సాం)పై, శ్రీకృష్ణప్రియా 21-8, 21-9 స్నేహన్ క్రిస్టియన్ (గుజరాత్)పై గెలువగా, వృశాలి 15-21, 17-21తో శ్రీయాన్షి పరదేశి (ఎయిరిండియా) చేతిలో ఓడింది.