సైనా నెహ్వాల్‌ ప్రేమ వివాహం..? | Saina Nehwal and Kashyap To Tie The Knot In December | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది చివర్లో సైనా-కశ్యప్‌ల వివాహం?

Published Wed, Sep 26 2018 12:44 PM | Last Updated on Wed, Sep 26 2018 12:47 PM

Saina Nehwal and Kashyap To Tie The Knot In December  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినిమా నేపథ్యం గల స్టార్లు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సాధారణమైన తరుణంలో క్రీడా నేపథ్యం ఉన్న ఆటగాళ్లు కూడా ఈ జాబితాలోకి చేరుతున్నారు. గతంలో ప్రేమ పెళ్లిల్లు చేసుకున్న దినేశ్‌- కార్తీక్‌- దీపికా పల్లికల్‌, గీతా ఫోగట్‌- పవన్‌ కుమార్‌, సాక్షి మాలిక్‌-సత్యవ్రత్ కాదియాన్‌‌, ఇశాంత్‌ శర్మ- ప్రతిమా సింగ్‌ల జాబితాలోకి బ్యాడ్మింటన్‌ స్టార్‌ జోడి చేరబోతోంది. బ్యాడ్మింటన్ స్టార్‌ ఆటగాళ్లు సైనా నెహ్వాల్‌, పారుపల్లి కశ్యప్‌లు త్వరలో ఒక్కటి కాబొతున్నారా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు వారి సన్నిహిత వర్గాలు. దశాబ్ద కాలంగా ప్రేమలో ఉన్న సైనా-కశ్యప్‌ల వివాహానికి పెద్దలు అంగీకారం తెలిపినట్టు సమాచారం. డిసెంబర్‌ 16న వివాహం, అదే నెల 21న రిసెప్షన్‌ ఉంటుందని తెలుస్తోంది. వీరి పెళ్లికి కేవలం 100 మంది అత్యంత సన్నిహితుల మాత్రమే హాజరవుతారని, కానీ హైదరాబాద్‌లో రిసెప్షన్ గ్రాండ్‌గా చేయాలని భావిస్తున్నారట. అయితే ఇప్పటివరకు సైనా-కశ్యప్‌ల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వీరిద్దరూ 2005 నుంచి గోపిచంద్‌ అకాడమీలో బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. గత కొంత కాలంగా వీరి ప్రేమ గురించి మీడియా ప్రస్తావించినప్పుడు స్పందించలేదు అదే విధంగా ఖండించనూలేదు. ఇద్దరు బ్యాడ్మింటన్‌ క్రీడాకారులు కాబట్టి వీరి ప్రేమ వ్యవహారం ఎక్కువగా వార్తల్లో నిలువలేదు. తాజాగా ఈ స్టార్‌ ఆటగాళ్లు వివాహం చేసుకోబుతున్నారని తెలియగానే అభిమానులు సంతోషంతో పాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 32 ఏళ్ల కశ్యప్‌ 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించాడు. 28ఏళ్ల సైనా నెహ్వాల్‌ 2010,2018 కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణాలు, 2012 ఒలంపిక్స్‌లో కాంస్య పతకం సాధించారు. 

చదవండి:
ఆట  మొదలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement