
బ్యాడ్మింటన్ కోర్టులో షట్లర్ పెళ్లి ప్రతిపాదన

హువాంగ్ య ఖియాంగ్... చైనా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.

శుక్రవారం మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో జెంగ్ సివీతో కలిసి బరిలోకి దిగిన హువాంగ్ విజేతగా నిలిచి స్వర్ణపతకం సొంతం చేసుకుంది.

అయితే పసిడి సాధించిన కొద్ది సేపటికే ఆమెకు సహచరుడి నుంచి అనూహ్యంగా పెళ్లి ప్రతిపాదన వచ్చింది.

చైనా డబుల్స్ ప్లేయర్ ల్యూ యుచెన్ ఉంగరాన్ని తీసుకొచ్చి ‘నన్ను పెళ్లాడతావా’ అంటూ హువాంగ్ ముందు మోకాళ్లపై కూర్చొని అడిగాడు.

వెంటనే తాను కూడా సంతోషంగా స్పందిస్తూ ఓకే చెప్పేసింది.

స్వదేశానికి ఒలింపిక్ పతకంతో పాటు ఇప్పుడు ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను కూడా ఆమె తీసుకెళుతోంది.









